Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధూళిపాళ్లను ఈ నెల 24 వరకు ఆస్పత్రిలోనే ఉంచాలని కోర్టు ఆదేశం

అమరావతి: సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను ఈ నెల 24 వరకు ఆస్పత్రిలోనే ఉంచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌కు ఇవే ఆదేశాలు వర్తిస్తాయని కోర్టు సూచించింది. వీరిని డిశ్చార్జ్‌ చేసే సమయంలో కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యంపై నివేదికలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. 


సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల  నరేంద్రకుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డెయిరీలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనను అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు ప్రకటించారు. అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం ఐపీసీ 408, 409, 418, 420, 465, 471, 120(బీ) రెడ్‌విత్‌ 34 కింద నరేంద్రపై అభియోగాలు మోపారు.

Advertisement
Advertisement