Abn logo
Jun 19 2021 @ 20:17PM

ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా

గూడూరురూరల్‌, జూన్‌ 19: స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ నాయకుడు మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ డిగ్రీ కోర్సుల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయాలన్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.  అరకొర ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసిన  నిరుద్యోగులకు ప్రభుత్వం అసంతృప్తి మిగిల్చిందన్నారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఏవో ప్రమీలకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చిన్నా, కార్తీక్‌, అరుణ్‌, జార్జ్‌ తదితరులు పాల్గొన్నారు.