Advertisement
Advertisement
Abn logo
Advertisement

కీలక ఆటగాళ్లను వదిలేసుకున్న ముంబై.. గుండె బద్దలవుతోందన్న రోహిత్

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక ఆటగాళ్లను వదులుకోవడంపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఇప్పటి వరకు కలిసి ఆడిన ఆటగాళ్లు దూరం కావడంతో మనసంతా బాధగా ఉందన్నాడు. రోహిత్‌శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్‌లను రిటైన్ చేసుకున్న ముంబై.. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్‌లను వదులుకుంది. 


ఒకప్పుడు తమ ఆటతీరుతో ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించిన వీరంతా ఇప్పుడు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతుండడంతోనే వారిని వదిలించుకున్నట్టు తెలుస్తోంది. వారి కోసం పెద్దమొత్తంలో డబ్బులు వెచ్చించడం దంగడని భావించడంతోనే ముంబై ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. 


తనతో కలిసి ఆడిన ఈ ఆటగాళ్లు దూరం కావడంపై రోహిత్ స్పందించాడు. ‘గన్‌ ప్లేయర్ల’ను వదులు కోవడం తనకు బాధగా ఉందన్నాడు.  తమకు చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు. ఎవరిని రిటైన్ చేసుకోవాలి? ఎవరిని వదులుకోవాలి? అనేది చాలా కఠినమైన నిర్ణయమని అన్నాడు.


ఫ్రాంచైజీ కోసం వారంతా అద్భుతంగా ఆడారని పేర్కొన్న రోహిత్.. చెరిగిపోలేని జ్ఞాపకాలను అందించిన వారిని వదిలేసుకోవడమంటే తట్టుకోవడం గుండెకు కొంచెం కష్టమైన పనేనని అన్నాడు. వేలంలో మంచి ఆటగాళ్లను సొంతం చేసుకుంటామని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు.

Advertisement
Advertisement