Abn logo
May 9 2021 @ 01:15AM

నేడు సంపూర్ణ కర్ఫ్యూ

రాయదుర్గం రూరల్‌, మే 8 : కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆదివారం మండలవ్యాప్తంగా సంపూర్ణ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు సీఐ ఈరణ్ణ తెలిపారు. వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం 36 గంటల పాటు కర్ఫూ విధించినట్లు పేర్కొన్నారు. శనివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు క ర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ఆల్‌ మర్చంట్స్‌ అసోసియేషన సభ్యులు అందరూ సహకరించాలని కోరా రు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూ చించారు. 


కణేకల్లు : కరోనా కట్టడిలో భాగంగా ఆదివారం సంపూర్ణ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ఎస్‌ఐ దిలీప్‌ కుమార్‌ తెలిపారు. ఆదివారం ఉ దయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. 


గుంతకల్లు టౌన: పట్టణంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యుడు, మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న  శ నివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాంసాహార దుకాణాలు, కూరగాయల దుకాణాలు తెరచుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటల తరువాత ప్రజలు రోడ్లపై కి వస్తే కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామన్నారు. మెడికల్‌ షాపులకు మినహాయింపు ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలన్నారు.


గుత్తి: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించుకుని స్వ చ్ఛందగా కర్ఫ్యూ పాటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మటన, చికెన, కూరగాయలు, పం డ్ల వ్యాపారులు ఉదయం 10 గంటలోపు విక్రయాలు చేసుకుని మూ సివేయాలన్నారు. 


ఉరవకొండ: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ఆ దివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ క ర్ఫ్యూ పాటించాలని ఎస్సై రమేష్‌ రెడ్డి తెలిపారు. రోడ్లపై అనవసరం గా తిరిగితే జరిమానా విధిస్తామన్నారు. కరోనా నియంత్రణలో భా గంగా ఆదివారం పూర్తి కర్ఫ్యూ పాటించాలని తెలిపారు. 


విడపనకల్లు: మండలంలో ఆదివారం 9 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉంటుందని విడపనకల్లు ఎస్‌ఐ గోపి శనివారం తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటలు వరకు మాత్రమే నిత్యావసరుకులు తీసుకెళ్లాలన్నారు. ఆ తరువాత ఎవరు రోడ్ల మీద కనిపించినా జరిమానా విధించటంతో పాటు కేసులు కూడా నమోదు చే స్తామన్నారు. సంపూర్ణ కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలు అందరూ పోలీసులకు సహకరించాలన్నారు. 


కళ్యాణదుర్గం: కొవిడ్‌ నేపథ్యంలో ఆదివారం సంపూర్ణ కర్ఫ్యూకు  అధికారులు ఆదేశాలిచ్చారు. శనివారం స్థానిక పోలీస్‌ సర్కిల్‌ కార్యాల య ఆవరణలో సీఐ తేజోమూర్తి, శానిటరీ ఇనస్పెక్టర్‌ హరిప్రసాద్‌, మార్కెట్‌యార్డు చైర్మన నాగలక్ష్మీహరిలతో కలిసి సమీక్ష నిర్వహించా రు. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోవడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆదివారం సంపూర్ణ కర్ఫ్యూకు నిర్ణయం తీసుకున్నామన్నారు.  అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు తప్పనిసరి సహకరించాలన్నారు. 


బెళుగుప్ప: కరోనా వైరస్‌ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తి చెందడంతో మండలంలో ఆదివారం సంపూర్ణ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఎస్‌ఐ హనూరుబాషా తెలిపారు. సోమవారం ఉదయం వరకు అమలులో ఉంటుందన్నారు. అత్యవసరపరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


యాడికి: కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతు న్న నేపథ్యంలో ఆదివారం మండలవ్యాప్తంగా పూర్తిస్థాయి కర్ఫ్యూ నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ రాంభూపాల్‌ తెలిపారు. ఉల్లంఘించిన వారి పై కొవిడ్‌ నిబంధనల ప్రకారం కేసులు నమోదుచేస్తామని హెచ్చ రించారు. ప్రజలంతా నిబంధనలు పాటించి కరోనా వైరస్‌ వ్యాప్తిని అ రికట్టడంలో సహకరించాలని ఆయన కోరారు. 


కంబదూరు: మండలంలో శనివారం రాత్రి నుంచి సోమవారం ఉ దయం 6 గంటల వరకు ఏ ఒక్క దుకాణం తెరవద్దని తహసీల్దారు ఈశ్వరయ్యశెట్టి దుకాణాదారులను హెచ్చరించారు. కరోనా నిబంధనలను ధిక్కరించి వ్యవహరించిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామన్నారు. జిల్లా చాంబర్‌ ఆఫ్‌కామర్స్‌, ఇండసీ్ట్రస్‌ వారి ఉత్తర్వుల మే రకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.

Advertisement