Abn logo

రాగి బిస్కెట్లు

వంద గ్రాముల రాగుల్లో 330 కేలరీల శక్తి ఉంటుంది. రాగుల్లోని క్యాల్షియం బుద్ధి బలాన్ని పెంచుతుంది. కాబట్టి షుగర్‌లెస్‌ ఈవినింగ్‌ స్నాక్‌గా రాగి బిస్కెట్లు ఇవ్వవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలంటే....
 
కావలసిన పదార్థాలు
రాగి పిండి - 1 కప్పు, యాలకుల పొడి - అర టీస్పూను, సొంఠి - చిటికెడు, గుడ్డు - 1
ఉప్పు - అర చెంచా, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ - అర కప్పు.
 
తయారీ విధానం
రాగి పిండి, యాలకుల పొడి బాండీలో వేసి నూనె లేకుండా రెండు నిమిషాలపాటు వేయించాలి. ఇప్పుడు గుడ్డు, సొంఠి, ఉప్పు వేసి కలపాలి. చివర్లో నూనె వేసి ముద్దలా కలపాలి. ఈ ముద్దను చిన్న ఉండలుగా చుట్టి, గుండ్రంగా బిస్కెట్లుగా వత్తుకోవాలి.
ఈ బిస్కెట్లను బటర్‌ పేపర్‌ వేసిన ట్రేలో పరుచుకోవాలి. ఓవెన్‌ను ప్రీ హీట్‌ చేసుకోవాలి.
180 డిగ్రీల దగ్గర 8 నిమిషాలపాటు బేక్‌ చేసి తీయాలి.


జాతి ఐక్యతకు వెలిగిన దివ్వెలు..

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

మూడు రోజుల పాటు ఇంటింటి సర్వే : కలెక్టర్‌

సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి : ఎస్పీ

తప్పుడు పోస్టు చేసిన వారిపై కేసు నమోదు

రోడ్లన్నీ నిర్మానుష్యం

వలస కూలీల ఆకలి కేకలు

బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల బారులు

దీపాలు వెలిగించాలంటూ డప్పు చాటింపు

ఘన్‌పూర్‌లో బియ్యం పంపిణీ ప్రారంభం
Advertisement
d_article_rhs_ad_1

నవ్య