Abn logo

వేప పువ్వు రసం

కావలసినవి పదార్థాలు
 
వేప పువ్వు - రెండు టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - ఒక టేబుల్‌ స్పూన్‌, నూనె, ఆవాలు, శెనగపప్పు - ఒక్కో టీ స్పూన్‌ చొప్పున, పసుపు, ఇంగువ - ఒక్కో చిటికెడు, చింతపండు రసం - పావు కప్పు, బెల్లం - చిన్న ముక్క, ఎండు మిర్చి - రెండు, కరివేపాకులు - కొన్ని, ఉప్పు - రుచికి సరిపడా.
 
 
తయారీ విధానం
 
నెయ్యి వేడిచేసి వేప పువ్వుని బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఎండబెట్టిన పూలు వాడుతుంటే కనుక నెయ్యిలో వేసిన వెంటనే బయటకు తీసేయాలి. లేదంటే అవి మాడిపోతాయి.
నూనె వేడిచేసి ఆవాలు, శెనగపప్పు, కరివేపాకులు, ఇంగువ, ఎండు మిర్చి ముక్కలు వేగించాలి.
తరువాత చింతపండు రసం పోసి.. ఉప్పు, బెల్లం, పసుపు వేసి చింతపండు రసం పచ్చి వాసన పోయే వరకు ఉడికించి, స్టవ్‌ మీద నుంచి గిన్నె దింపేయాలి.
ఇప్పుడు వేగించిన వేప పువ్వును కలపాలి. ఇది కలిపాక రసం ఉడికించొద్దు. ఈ రసం అన్నంలో కలిపి తింటే బాగుంటుంది. లేదా సూప్‌లా కూడా తాగేయొచ్చు.

మంచిర్యాల కలెక్టర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులునిర్మల్‌లో రెండు సింహాల సంచారం?బాధిత కుటుంబాలకు పరామర్శ ‘ఎస్సీ, ఎస్టీ చట్టాల అమలులో నిర్లక్ష్యం’ బీడీ కార్మికులకు పని దినాలు పెంచండి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మున్సిపల్‌ చైర్మన్‌నర్సరీని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌కడెం అడవుల్లో పర్యటించిన జడ్పీ చైర్మన్‌‘రైతులు కస్టమర్‌ చార్జీలను చెల్లించాలి’
Advertisement
Advertisement