Abn logo

బెల్లం అరిసెలు

కావలసినవి
 
బియ్యం - ఒకకప్పు, బెల్లం - ఒకకప్పు, యాలకులు - నాలుగు, నెయ్యి - ఒక టీస్పూన్‌, నూనె - డీప్‌ ఫ్రైకి తగినంత.
 
తయారీవిధానం
 
బియ్యం శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత నీళ్లు తీసేసి పలుచటి వస్త్రంలో పోసి ఆరబెట్టుకోవాలి. బియ్యం కొంచెం తడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. యాలకులను మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో కొన్ని నీళ్లు పోసి బెల్లం వేసి ఉడికించాలి. నీళ్లలో పానకం చుక్క వేస్తే కరిగిపోకుండా ఉన్నప్పుడు సరిగ్గా ఉడికినట్టుగా భావించాలి. ఇప్పుడు స్టవ్‌ ఆపేసి ఈ పానకాన్ని గ్రైండ్‌ చేసి పెట్టుకున్న పిండిలో నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడ మిశ్రమం మరింత చిక్కగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి. గారెల మాదిరిగా చేసుకుంటూ నూనెలో వేసి వేగించాలి. అంతే... నోరూరించే బెల్లం అరిసెలు రెడీ.

షోర్‌ భాజామావా కోకొనట్‌ రోల్‌కడాకనీసగ్గుబియ్యం పాయసం (వీడియో)రసగుల్లరవ్వ అప్పాలుబెల్లం అన్నంకొబ్బరి తీపి కుడుములుబాసుందిమ్యాంగో పనీర్‌ రోల్స్‌
Advertisement
Advertisement