Abn logo

కోకోనట్‌ బర్ఫీ

కావలసినవి
 
నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, కొబ్బరితురుము - రెండు కప్పులు, కోవా - ఒక కప్పు, పాలు - రెండు కప్పులు, పంచదార - ఒక కప్పు, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, రోజ్‌వాటర్‌ - ఒక టీస్పూన్‌, కుంకుమ పువ్వు - కొద్దిగా, ఫుడ్‌ కలర్‌ - చిటికెడు.
 
తయారీవిధానం
 
పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక కొబ్బరి తురుము వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత పాలు, పంచదార వేసి కలియబెట్టాలి. మిశ్రమం చిక్కబడే వరకు చిన్నమంటపై ఉంచాలి. తరువాత కుంకుమపువ్వు, యాలకుల పొడి, రోజ్‌వాటర్‌ వేసి కలపాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత కోవా వేసి నెమ్మదిగా కలియబెట్టాలి. ఇప్పుడు మిశ్రమాన్ని రెండు వేర్వేరు వెడల్పాటి పాత్రల్లోకి మార్చి నచ్చిన ఫుడ్‌కలర్‌ కలపాలి.
వేడిగా ఉండగానే ఒక పాన్‌లోని మిశ్రమాన్ని మరో పాన్‌లో మిశ్రమంపై పోయాలి. పాన్‌ అంతటా సమంగా వచ్చేలా చూసుకోవాలి. చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. డైమండ్‌ ఆకారంలో కట్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

రసాభాసగా మున్సిపల్‌ సమావేశంఘనంగా సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతివానమామలై వరదాచార్యుల వర్ధంతి మిషన్‌ భగీరథ పనులు ప్రారంభంకార్మిక హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలు స్కీంల పేరుతో వలఅవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే విమర్శలుప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి తాత్కాలిక రహదారి ఏర్పాటు ఇంటింటికి మిషన్‌ భగీరథ నీరందించాలి
Advertisement
Advertisement