Abn logo

పుట్టగొడుగుల వేపుడు

కావలసినవి
 
పుట్టగొడుగులు - పావుకేజీ, జీడిపప్పు - పది పలుకులు, ఉల్లిపాయ - ఒకటి, టమాట - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - ఒకటి, కరివేపాకు - రెండు రెమ్మలు, ఆవాలు - పావు టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, నూనె - సరిపడా, కారం - అర టీస్పూన్‌, పసుపు - చిటికెడు, గరంమసాల - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారీవిధానం
 
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్‌ చేసుకోవాలి. జీడిపప్పు లుకులను పావుగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు మరికాసేపు వేగించాలి.
తరువాత ఉల్లిపాయలు వేయాలి. టమాట ముక్కలు వేసి మరికాసేపు వేగనివ్వాలి. పసుపు, కారం, గరంమసాలా, కరివేపాకు వేసి ఇంకాసేపు వేగించాలి. ఇప్పుడు పుట్టగొడుగులు, జీడిపప్పు, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. చిన్నమంటపై ఉడికించుకోవాలి. కావాలనుకుంటే నిమ్మరసం పిండుకోవచ్చు. పుట్టగొడుగులు ఉడికిన తరువాత దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి. చపాతీలోకి లేక అన్నంలోకి ఈ పుట్టగొడుగుల ఫ్రై రుచిగా ఉంటుంది.

రసాభాసగా మున్సిపల్‌ సమావేశంఘనంగా సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతివానమామలై వరదాచార్యుల వర్ధంతి మిషన్‌ భగీరథ పనులు ప్రారంభంకార్మిక హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలు స్కీంల పేరుతో వలఅవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే విమర్శలుప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి తాత్కాలిక రహదారి ఏర్పాటు ఇంటింటికి మిషన్‌ భగీరథ నీరందించాలి
Advertisement
Advertisement