Abn logo

పల్లీ గ్రేవీ కర్రీ

కావలసిన పదార్థాలు:
పల్లీలు- ఒక కప్పు, పచ్చికొబ్బరి- పావుకప్పు, ఎండుమిర్చి- 2, తరిగిన టమోట, ఉల్లిపాయ- ఒక్కోటి చొప్పున, వెల్లుల్లి రెబ్బలు- 10, ఆవాలు, జీలకర్ర- అర టీస్పూన్‌ చొప్పున, జీడిపప్పు- కొద్దిగా, గరం మసాలా- అర టీస్పూను, కారం- ఒక టీస్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద- అర టీ స్పూను, సోంపు పొడి- అర టీ స్పూను, కొత్తిమీర- కొద్దిగా, ఉప్పు- తగినంత.

తయారీ విధానం:
పల్లీలను అరగంట ముందు నానబెట్టి కుక్కర్‌లో రెండు విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించాలి. తర్వాత ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక జీడిపప్పు, కొబ్బరి, ఎండుమిర్చి, టమోటా ముక్కలు వేసి వేగించాలి. వాటికి సోంపు పొడి, కారం, గరం మసాలా, అల్లంవెల్లుల్లి ముద్ద కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత బాణలిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకులతో పోపు పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు, మసాలా ముద్ద, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి దించేయాలి.

రసాభాసగా మున్సిపల్‌ సమావేశంఘనంగా సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతివానమామలై వరదాచార్యుల వర్ధంతి మిషన్‌ భగీరథ పనులు ప్రారంభంకార్మిక హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలు స్కీంల పేరుతో వలఅవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే విమర్శలుప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి తాత్కాలిక రహదారి ఏర్పాటు ఇంటింటికి మిషన్‌ భగీరథ నీరందించాలి
Advertisement
Advertisement