Abn logo

రాజస్తానీ సాంగో ఆలు

కావలసిన పదార్థాలు : బంగాళ దుంప - 1, పెరుగు - 100గ్రా., సగ్గుబియ్యం - 50గ్రా., జీడిపప్పు పేస్ట్‌ - 25గ్రా., ఉల్లి ముద్ద - 10గ్రా., అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - స్పూను, పచ్చిమిర్చి - 5(పేస్ట్‌ చేసుకోవాలి), దాల్చిన చెక్క - కొద్దిగా, జీలకర్ర - అర చెంచా, పసుపు - పావు స్పూను, ధనియాల పొడి - అరచెంచా, గరం మసాలా - అర చెంచా, కారం పొడి - అర చెంచా ఉప్పు - తగినంత, నిమ్మరసం - రెండు చెంచాలు, నెయ్యి - 25గ్రా., ఎండు మిరపకాయలు - 2, కొత్తిమీర తురుము - చెంచా, పుదీనా తురుము - చెంచా, పచ్చి బఠానీ - అర కప్పు, పచ్చి కొబ్బరి - అర కప్పు నీరు - తగినంత, నూనె - తగినంత.
తయారీ విధానం :
బంగాళదుంప పై పొర తీసేసి కొద్దిసేపు నీళ్లలో ఉడికించాలి. తరువాత నూనెలో దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడో బాణలిలో నెయ్యివేసి కాగిన తరువాత జీలకర్ర, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లంవెల్లులి, పచ్చికొబ్బరి, నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిబఠాని, మిర్చిపొడి, పసుపు, ధనియాల పొడి, గరం మసాలను వేసి సన్నని సెగపై రెండు నిమిషాలు ఉడికించాలి. అనంతరం జీడిపప్పు ముద్ద, పెరుగును అందులో వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత బంగాళదుంప వేసి మరో మూడు నిమిషాలు ఉడికించాక గ్లాసు నీళ్లు పోసి నిమ్మరసం వేసి సరిపడా ఉప్పుకూడా వేసుకోవాలి. దీంతో రాజస్థానీ సాంగో ఆలు తయారైనట్టే. పైన కొత్తిమీర, పుదీనా తురుము చల్లుకుంటే ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా సువాసన వెదజల్లుతూ రుచిగా ఉంటుంది. పరోటా, రోటీ, పలావు, అన్నంతో కలిపి వేడివేడిగా తింటే మంచి రుచిగా ఉంటుంది.

రసాభాసగా మున్సిపల్‌ సమావేశంఘనంగా సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతివానమామలై వరదాచార్యుల వర్ధంతి మిషన్‌ భగీరథ పనులు ప్రారంభంకార్మిక హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలు స్కీంల పేరుతో వలఅవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే విమర్శలుప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి తాత్కాలిక రహదారి ఏర్పాటు ఇంటింటికి మిషన్‌ భగీరథ నీరందించాలి
Advertisement
Advertisement