Abn logo

గుమ్మడికాయ పాలకూర కర్రీ

కావలసిన పదార్థాలు: గుమ్మడి ముక్కలు - 1 కప్పు, లేత పాలకూర తరుగు - 3 కప్పులు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లి తరుగు - 1 కప్పు, వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను, ఆవాలు, జీలకర్ర - పావు టీ స్పూను చొప్పున, కరివేపాకు - 4 రెబ్బలు, కూర పొడి - 4 టేబుల్‌ స్పూన్లు, నీరు - 2 కప్పులు, కొబ్బరిపాలు - 1 కప్పు.
తయారుచేసే విధానం: నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లి, వెల్లుల్లి ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. అవి వేగాక 3 టేబుల్‌ స్పూన్ల కూరపొడితో పాటు గుమ్మడి ముక్కలు కూడా వేసి మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత నీరు పోసి ఉడికించాలి. నీరు కొద్దిగా ఉండగానే కొబ్బరిపాలు పోసి, మిగిలిన కూరపొడి చల్లాలి. కూర చిక్కబడ్డాక పాలకూర తరుగు వేసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. ఇష్టమయితే టీ స్పూను బెల్లం పొడి చల్లుకోవచ్చు. ఈ కూర అన్నంతో పాటు పరాటాలతో కూడా బాగుంటుంది.


జాతి ఐక్యతకు వెలిగిన దివ్వెలు..

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

మూడు రోజుల పాటు ఇంటింటి సర్వే : కలెక్టర్‌

సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి : ఎస్పీ

తప్పుడు పోస్టు చేసిన వారిపై కేసు నమోదు

రోడ్లన్నీ నిర్మానుష్యం

వలస కూలీల ఆకలి కేకలు

బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల బారులు

దీపాలు వెలిగించాలంటూ డప్పు చాటింపు

ఘన్‌పూర్‌లో బియ్యం పంపిణీ ప్రారంభం
Advertisement
d_article_rhs_ad_1

నవ్య