Abn logo

ఆలూ బర్గర్‌

కావలసిన పదార్థాలు: ఆలూ - వందగ్రాములు, పచ్చిబఠాణి - 60 గ్రా., ఆవాలు - 15 గ్రా., కరివేపాకు - 4 రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్టు - 20 , పసుపు - 5 గ్రా., కొత్తిమీర - 1 కట్ట, ఉప్పు- రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా, టమోటాలు - 2, ఉల్లిపాయ -1, గోధుమ బర్గర్‌ బన్స్‌ (బేకరీల్లో అమ్ముతారు) - 2.
తయారుచేసే విధానం: టమోటాలను, ఉల్లిపాయను గుండ్రంగా స్లైసుల్లా తరిగి పక్కనుంచుకోవాలి. ఆలూని ఉడికించి మెదిపి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు చిటపటమన్నాక కరివేపాకు, అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి వేగాక, పసుపు, పచ్చిబఠాణీ, ఆలూ వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల్లో దించేసి ఈ ముద్దను రెండు సమభాగాలు చేసి గుండ్రని ఆకారంలో ఒత్తి నాన్‌స్టిక్‌ పాన్‌లో రెండు వైపులా దోరగా వేగించాలి. వీటిని రెండు బన్‌ల మధ్య టమోటా, ఉల్లిపాయ చక్రాల్తో పెట్టి తింటే చాలా రుచిగా ఉంటాయి.


కరోనా అని అనుమానం.. మృతదేహాన్ని ఇంటికి రానివ్వని ఇంటి యజమాని

పారిశుధ్య కార్మికులకు మాస్కుల పంపిణీ

బ్యాంకులకు పింఛన్‌దారుల తాకిడి

పేదలకు ఉచిత సరుకుల పంపిణీ

కూలీలకు సరుకుల పంపిణీ అభినందనీయం: డీఎస్పీ

చచ్చినా వదలని కరోనా కష్టాలు!

జిల్లాలో మరో మూడు పాజిటివ్‌ కేసుల నమోదు

ఢిల్లీ టు ఆదిలాబాద్‌

జాతి ఐక్యతకు వెలిగిన దివ్వెలు..

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
Advertisement
d_article_rhs_ad_1

నవ్య