Abn logo

బూందీ లడ్డు

కావలసిన పదార్థాలు : శనగపిండి-ముప్పావు కిలో, నూనె-ఒక కేజి, పంచదార-ఒక కేజి, యాలకుల పొడి-ఒక టీస్పూన్‌.
తయారుచేసే విధానం : ఒక పాత్రలో శనగపిండి, నీళ్లు పోసి బూందీ వేయడానికి వీలుగా పిండిని కాస్త జారుడుగా కలుపుకోవాలి. స్టవ్‌పై కళాయి ఉంచి నూనె పోసి అది బాగా మరిగాక బూందీ దూసే గరిటెలో శనగపిండిని వేసి చేతితో కలుపుతూ ఉంటే కళాయిలో బూందీ పడుతూ ఉంటుంది. ఈ బూందీని వేగిన తరువాత తీసి మరో గిన్నెలో ఉంచుకోవాలి. మరో కళాయి స్టవ్‌పై ఉంచి అందులో పంచదార, నీళ్లు పోసి కాస్త లేత పాకం రాగానే బూందీని అందులో వేసి ఆపకుండా ఒక పావుగంటపాటు కలుపుతూ ఉండాలి. ఇందులో యాలకుల పొడి వేసి మళ్లీ ఒకసారి బాగా కలిపి అర చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి.

మిడతల దండు ముప్పు తప్పినట్లేనా?పదికి సిద్ధంరైతులు ఆందోళన చెందవద్దు: మిడతల రాష్ట్ర పరిశీలన బృందంబాసర ట్రిపుల్‌ ఐటీలో అగ్ని ప్రమాదంఅకాల వర్షం.. తడిసిన ధాన్యంరోడ్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలుపౌల్ట్రీ పల్టీ !హైలేవల్‌ కాలువలపై మరోసారి కదలిక కలెక్టరేట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల ధర్నాప్రభుత్వ ఆదేశాల మేరకు ఆవిర్భావ వేడుకలు
Advertisement
d_article_rhs_ad_1
Advertisement