Abn logo

రైస్‌బ్రౌన్‌ లడ్డు

కావాల్సిన పదార్థాలు: తెల్లనువ్వులు - పావుకిలో, వేరుశెనగగుళ్లు - పావుకిలో, బెల్లం - అరకిలో, తాటిబెల్లం - 50గ్రాములు, తౌడు - 50గ్రాములు, యాలకులు - ఆరు.
తయారుచేయు విధానం: నువ్వులు, వేరుశెనగగుళ్లు విడివిడిగా దోరగా వేయించి ఆరనివ్వాలి. బెల్లం, తాటిబెల్లం దంచుకుని పెట్టుకోవాలి. యాలకులు కూడా దంచుకుని పెట్టుకోవాలి. ముందు వేరుశెనగగుళ్లు మిక్సిలో వేసి చెక్కాబద్దగా పట్టి ఒక పళ్లెంలో పోసుకోవాలి. నువ్వులు కూడా మిక్సీలో వేసి మీరా అంత మెత్తగా కాకుండా పట్టుకుని అదే పళ్లెంలో పోసుకోవాలి. అందులో తౌడు, దంచిపెట్టుకున్న బెల్లం, యాలకుల పొడి కలిపిపెట్టుకుని ఆ మిశ్రమాన్ని కొంచెం మిక్సీలో వేసి తిప్పితే పదార్థాలన్నీ చక్కగా కలుస్తాయి. దీన్ని ఒక గిన్నెలో పెట్టుకుని మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఎంతో శక్తినిచ్చే రైస్‌బ్రౌన్‌ లడ్డూలు రెడీ

కొమురం భీం ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేతమహాగౌరీ అలకారంలో బాసర అమ్మవారుసీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యేమిషన్‌ భగీరథ పనులపై ఎమ్మెల్యే సమీక్షపోలీసు అమరవీరులకు నివాళివైభవంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు పూల పండుగకు వేళాయేకడెం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 468 క్యూసెక్కులుకొమురం భీం ప్రాజెక్ట్ నుండి 295 క్యూసెక్కుల నీరు విడుదలఏకోపార్కు రిపోర్టును సిద్ధం చేయండి
Advertisement
Advertisement