Abn logo

ద్రాక్ష రైతా

కావాల్సిన పదార్థాలు
 
పెరుగు - రెండు కప్పులు, ద్రాక్షపండ్లు (నిలువుగా రెండు భాగాలు తరిగి) - ఒక కప్పు, పంచదార - ఒకటిన్నర టీస్పూన్‌, ఉప్పు - సరిపడా, వేగించిన జీలకర్ర పొడి - రెండు చిటికెలు, కారం - చిటికెడు, పుదీనా - అలంకరణకు.
 
 
తయారీ విధానం
 
చిక్కటి పెరుగును పెద్ద గిన్నెలో వేసి గిలక్కొట్టి జారుగా చేయాలి.
ఇందులో ఉప్పు, సరిపడా పంచదార వేయాలి. పంచదార కరిగేవరకు కలపాలి.
తరువాత ద్రాక్షపండ్ల ముక్కలు వేసి ముక్కలకు పెరుగు బాగా పట్టే వరకు కలపాలి.
జీలకర్రపొడి, కారం, పుదీనాలతో అలంకరించాలి. ఓ నాలుగు ద్రాక్షపండ్ల ముక్కలు పైన వేస్తే... చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది.
ఈ రైతాను పులావ్‌, బిర్యానీలతో తినొచ్చు. లేదంటే వట్టిదే కూడా తినొచ్చు.

నీట్‌లో ప్రతిభ చాటిన విద్యార్థినికి సన్మానం చిరుతపులి చర్మం విక్రయించే యత్నంధరణి పోర్టల్‌ ప్రారంభంఐక్యతతోనే హక్కుల సాధననిప్పు కణిక..రైతువేదికల నిర్మాణంలో జాప్యంనేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభంమంచిర్యాలలో పెద్దపులి సంచారంజిల్లాలో మూడు కరోనా కేసులుకార్మిక చట్టాలను సవరించాలి
Advertisement
Advertisement