Abn logo

క్యారెట్‌, కుకుంబర్‌ రైతా

కావలసిన పదార్థాలు: క్యారెట్‌ తురుము - అర కప్పు, కీరదోసకాయ - అరకప్పు(తురుము లేదా ముక్కలు), పెరుగు - 2 కప్పులు, పచ్చిమిర్చి - 4, శనగపప్పు - 1 టీ స్పూను, మినప్పప్పు - 1 టీ స్పూన, ఆవాలు - 1 టీ స్పూన, జీలకర్ర - అర టీ స్పూన, ఎండుమిర్చి - 6, కరివేపాకు - రెండు రెమ్మలు, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, ధనియాలపొడి - అర టీ స్పూన, జీలకర్ర పొడి - అర టీ స్పూన, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు
తయారుచేయు విధానం: ముందుగా పానలో నూనె వేసి కాగాక క్యారె ట్‌ తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి పక్కన ఉంచాలి. తర్వాత గిన్నెలో పెరుగు, ఉప్పు, పసుపు కొద్దిగా నీళ్ళు వేసి గిలక్కొట్టాలి. ఇప్పుడు మరో డీప్‌ ఫ్రైయింగ్‌ పానలో నూనె వేసి కాగాక అందులో ఎండు మిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వరుసగా వేసి వేయించాలి. చిలికిన పెరుగులో వేయించి ఉంచుకున్న క్యారెట్‌ తురుము వేసి కలపాలి. వేయించి ఉంచుకున్న పోపు కూడా జోడించాలి. ఇప్పుడు కీరదోసకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. అంతే క్యారెట్‌ రైతా రెడీ. ఇది అన్నంలోకి, రోటీలలోకి బాగుంటుంది.


జాతి ఐక్యతకు వెలిగిన దివ్వెలు..

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

మూడు రోజుల పాటు ఇంటింటి సర్వే : కలెక్టర్‌

సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి : ఎస్పీ

తప్పుడు పోస్టు చేసిన వారిపై కేసు నమోదు

రోడ్లన్నీ నిర్మానుష్యం

వలస కూలీల ఆకలి కేకలు

బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల బారులు

దీపాలు వెలిగించాలంటూ డప్పు చాటింపు

ఘన్‌పూర్‌లో బియ్యం పంపిణీ ప్రారంభం
Advertisement
d_article_rhs_ad_1

నవ్య