Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 26 2016 @ 10:12AM

ఆటల టపాసులు..

దీపావళి వేళ సంప్రదాయాలను ఆచరిస్తూనే వినోదాన్ని పంచుకోవాలకునే కుర్రకారు మొదలుకుని, నడి వయసు మహిళల వరకూ ఇప్పుడు ఆన్‌లైన్‌కే జై కొడుతున్నారు. ప్రీ దీపావళి వేడుకలు మొదలు.. పోస్ట్‌ దీపావళి వరకూ ఆన్‌లైన్‌లోనే వినోదమంతా పొందాలనుకుంటున్నారు. తీన్‌పత్తి, రమ్మీ, వంటి గేమ్స్‌ను వర్ట్యువల్‌గా ఆడుతూ సంతోషం రెట్టింపు చేసుకుంటున్నారు. --ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ
 
దీపావళి వస్తుందంటే చాలు.. తీన్‌పత్తి, రమ్మీ లాంటి కార్డ్‌ గేమ్స్‌కు ఎక్కడా లేని ప్రాధాన్యత వస్తుంటుంది. మరీ ముఖ్యంగా దీపావళి వేడుకలను సంప్రదాయబద్దంగా జరుపుకునే కుటుంబాలలో వయసులు, లింగ బేధాలు లేకుండా పండుగ వేళ ఈ కార్డ్‌ గేమ్స్‌ ఆడటం ఓ సంప్రదాయం. తమ అదృష్టం ఏ విధంగా ఉందనేది తెలుసుకునేందుకు ఓ మార్గంగా వారు భావిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ అది నిజం. ఈ సంప్రదాయమే వందల కోట్ల రూపాయల వ్యాపారం డిజిటల్‌ యుగంలో ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్స్‌ సైట్లకు తీసుకువస్తుంది. కెపీఎంజీ నివేదిక ప్రకారం 2014లో 1070 బిలియన్‌ రూపాయల వ్యాపారం ఈ మొబైల్‌ గేమింగ్‌పై జరిగింది. మన నగరంలో తీన్‌పత్తి, రమ్మీలు దీపావళికు ఆడటం సంప్రదాయమైనట్లే ఆన్‌లైన్‌లో సైతం ఈ గేమ్స్‌ ఆడటం సంప్రదాయంగా మార్చుకున్నారు. వీటితో పాటుగా ఇటీవలి కాలంలో బుల్‌షిట్‌, బ్లాక్‌జాక్‌, ఏకె 47, ఫోర్‌హెడ్‌, వ్రాపింగ్‌ అప్‌ లాంటి గేమ్స్‌ కూడా ఆడుతున్నారు. అయితే ఎన్ని రకాల గేమ్స్‌ ఉన్నప్పటికీ 13 ముక్కలతో ఆడే రమ్మీ మాత్రం ఎవర్‌గ్రీన్‌ అన్నది గేమర్ల మాట. దక్షిణాదిలో రమ్మీకు ఈ దివాలీలో బాగా క్రేజ్‌ ఉంటే నార్త్‌, వెస్ట్‌ ఇండియాలో మాత్రం తీనపత్తి అధికంగా ఆడతారనిఅంటున్నారు అల్టిమేట్‌ గేమ్స్‌, రమ్మీ సర్కిల్‌ వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్న ప్లే గేమ్స్‌ 24ఘ7 కో ఫౌండర్‌, సీఈవో భావిన పాండ్యా. ఏస్‌2త్రీ, రమ్మీ సర్కిల్‌ లాంటి ఎన్నో గేమింగ్‌ సైట్లు ప్రత్యేకంగా ఈ దీపావళి కొరకు టోర్నమెంట్స్‌ నిర్వహిస్తున్నాయి. ఏస్‌2 త్రీ డాట్‌కామ్‌ అయితే ఏకంగా కోటి రూపాయలను గెలుచుకునే అవకాశం కల్పిస్తుందంటే సంప్రదాయం వెనుక ఎంతటి వ్యాపారం జరుగుతుందో ! తాము గత ఏడేళ్లగా ఈ టోర్నీలను నిర్వహిస్తున్నామని భావిన పాండ్యా అంటున్నారు. తామునిర్వహించే దివాలీ రమ్మీ టోర్నమెంట్‌కు అపూర్వమైన స్పందన ఉంటుందని చెబుతున్నారాయన.
 
దీపావళి ముందు ఎక్కువ..
దీపావళి పండుగ వస్తుందంటే కొన్ని కుటుంబాల్లో ఇల్లంతా శుభ్రపరుచుకోవడానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో కొన్ని కుటుబాల్లో కార్డ్‌ గేమ్స్‌ ఆడటానికీ అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ ధోరణి మారింది. 24 గంటలూ మొబైల్‌ తమ చెంతనే ఉండటం.. వందల కొద్దీ యాప్స్‌ అందుబాటులో ఉండటంతో చేతిలో పేక ముక్కలు తీసుకోవడం కన్నా స్మార్ట్‌ఫోన్‌పై బటన్స్‌ ప్రెస్‌ చేయడాన్నే ఎక్కువ ఇష్టపడుతున్నారిప్పుడు. తమ గేమింగ్‌ నైపుణ్యం మెరుగు పరుచుకోవాలనుకునే వారు దీపావళికు ముందు ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుతుంటారు కానీ దీపావళి రోజున అది బాగా తగ్గుతుంది. చాలామంది దీపావళి ముందు, వెనుక రోజుల్లో మాత్రం ఈ ఆటను ఎక్కువగా ఆడుతుంటారన్నది ఆయా ఆన్‌లైన్‌ గేమ్స్‌ సైట్ల నిర్వాహకుల మాట. ఆన్‌లైన్‌లో సాధారణంగా రెండు రకాలుగా గేమ్స్‌ జరుగుతుంటాయి. ఒకటి గేమ్‌ ఆఫ్‌ ఛాన్స్‌ అయితే మరోటి గేమ్‌ ఆఫ్‌ స్కిల్స్‌ ! గేమ్‌ ఆఫ్‌ ఛాన్స్‌ అంటే గుండాట లాంటిది. దీనిలో పాచికలు లేదంటే స్లాట్స్‌, స్పిన్నింగ్‌ టాప్స్‌, నంబర్డ్‌ బాల్స్‌ వంటివి ఉపయోగించి విజేతను ఎన్నిక చేస్తారు. ఇదంతా అదృష్టంతో ఆధారపడిన గేమ్స్‌. సాధారణంగా 25 ఏళ్లకు పైబడిన వారు ఈ తరహా గేమ్స్‌ ఆడుతున్నారని భావిన పాండ్యా చెబుతూ ఇటీవలికాలంలో మహిళలు సైతం ఈ గేమ్స్‌ ఆడుతున్నారని.. కానీ అది 10 శాతం మించి ఉండటం లేదని అన్నారు.
 
ముక్కలాట ఎందుకంటే..
దీపావళి రోజు గాంబ్లింగ్‌కు ఓ సంప్రదాయం కూడా ఉందనేది ఈ కార్డ్‌ గేమ్స్‌ను పండుగనాడు తప్పనిసరిగా ఆడే తనీష్‌ అగర్వాల్‌. పార్వతీ దేవి, శివునితో ఆ రోజున పాచికల ఆట ఆడిందని.. ఆ రోజున ఎవరైతే ఈ ఆట ఆడతారో వారికి సంవత్సరమంతా సిరిసంపదలు కలుగుతాయని ఆమె వరం అందించారని, ఆ పాచికల ఆటే నేడు పేక ముక్కలుగా మారిందన్నది తమ నమ్మికని అతను చెబుతున్నాడు. ఎల్లోరా శిల్పాలలో కూడా ఓ చోట శివపార్వతులు ఈ పాచికలాట ఆడటం కూడా కనిపిస్తుందంటున్న అతను ఈ నమ్మిక కారణంగానే చాలామంది తమ ఇళ్లలో ఈ పేకాట ఆడటం జరుగుతుందంటున్నారు. దీపావళి వారమంతా ఈ పండుగను సంప్రదాయంగా జరుపుకునే కుటుంబాలలో తప్పనిసరిగా ఈ ఆటలు కనిపిస్తాయట.
 
దివాలీ రమ్మీ టోర్నమెంట్‌..
కోటి రూపాయల ప్రైజ్‌ మనీతో అక్టోబర్‌ 29 వరకూ రమ్మీలో పోటీలను నిర్వహిస్తుంది ఏస్‌2 రమ్మీ డాట్‌ కామ్‌. దేశవ్యాప్తంగా పేకాట అభిమానులంతా ఈ గేమ్‌లోరిజిస్టర్‌ చేసుకుని పాల్గొనవచ్చు. మూడు విభాగాలుగా ఈ టోర్నీవిభజించారు. ప్రతి సోమ, బుధవారాల్లో మధ్యాహ్నం 3గంటలకు స్పార్ల్కర్‌ టోర్నీస్‌ అంటూ మొదటి బహుమతిగా 71,650 రూపాయలు అందిస్తున్నారు. మొత్తంమ్మీద 40 లక్షల రూపాయలు బహుమతి ఆ రోజుల్లో పంచుతారు. ప్రతి శనివారం రాకెట్‌ టోర్నీ అంటూ మొదటి బహుమతిగా 1లక్ష రూపాయలు అందిస్తారు. గ్రాండ్‌ దివాలీ టోర్నీగా అక్టోబర్‌ 29న మధ్యాహ్నం మూడు గంటలకు టోర్నీనిర్వహించి మొదటి బహుమతిగా 10లక్షల రూపాయలు అందిస్తారు. ఇవేనా ఏస్‌2త్రీ డాట్‌ కామ్‌ వెల్‌కమ్‌ బోన్‌సగా 1700 రూపాయలుతో పాటుగా ఎన్నో ఆఫర్లనూ అందిస్తుంది.
 

హైక్‌ మెసెంజర్‌పై తీన్‌పత్తి..!

ఆన్‌లైన్‌లో ప్రత్యక్షంగా తీన్‌పత్తి ఆడేందుకు హైక్‌ మెస్సేంజర్‌ అవకాశం కల్పిస్తుందిప్పుడు. హైక్‌పై ఇప్పటికే రోజుకు సరాసరి 25 నిమిషాల సమయం వెచ్చిస్తూ మరీ ఈ గేమ్‌ ఆడుతున్నారు. 1ఎంబీ పరిమాణంలో ఉండే ఈ గేమ్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం హైక్‌ కల్పిస్తుంది. దీపావళి సందర్భంగా ఓ సోషల్‌యా్‌ప్‌ను ప్రారంభించాలనుకున్నప్పుడు వినియోగదారుల నుంచి తీన్‌పత్తి గేమ్‌ గురించి అడుగుతూ అభ్యర్థనలు వచ్చాయి.
దీపావళికు సంప్రదాయంగా తీన్‌పత్తి ఆడ టం సంప్రదాయంగా చాలామంది భావిస్తున్నారు. తీన్‌పత్తి నైట్స్‌ను మొబైల్‌ ఫోన్స్‌పై సులభంగా ఆడేలా తీర్చిదిద్దాం. హైక్‌ను వినియోగిస్తున్న వారిలో 90 శాతం మంది 30 ఏళ్లలోపు వారే.. అని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
 
దీపావళి వెలుగులు..
మరో నాలుగు రోజుల్లో దీపావళి పండుగ రాబోతుంది. ఆ రోజు తమ ఇంట పండుగ చేసుకోవడమే కానీ స్నేహితులను కలుసుకునే అవకాశం ఎక్కడుంటుంది ? అందుకే అంటూ నగర సోషలైట్స్‌ బేగంపేటలోని ఓ హోటల్‌లో ప్రీ దీవాలీ బాష్‌ పేరిట దీపావళి వేడుకలు చేసుకున్నారు. సంప్రదాయాలను అనుసరిస్తూ దీపజ్యోతులను వెలిగించిన వీరు.. టపాసులు కాలుస్తూ కేరింతలు కొట్టారు.