Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 26 2016 @ 10:12AM

ఆ హంతకుడు అడిగిన దానికి నా వృత్తిమీద కోపమూ, అసహ్యమూ కలిగింది

సుప్రసిద్ధ దేశ భక్తులు సి.రాజగోపాలా చారి సేలం (తమిళనాడు)లో న్యాయవాదిగా గొప్ప పేరుప్రఖ్యాతులు సంపాదించారు. రక రకాల కక్షిదారులతో ఆయనకు వింత అనుభవాలు కలిగేవి. హత్యానేరం ఆరోపించబడిన ఒక ముద్దాయిని రాజాజీ తన వాద నైపుణ్యంతో ఉరిశిక్ష పడకుండా తప్పించి నిర్దోషిగా నిరూపించి విడుదల చేయించారు. విడుదల అయిన తర్వాత అతను రాజాజీని దర్శించుకొని, కృత జ్ఞతలు తెల్పి ఒక కోరిక కోరాడు. తాను హత్య చేయటానికి ఉపయోగించిన కత్తిని కోర్టువారి నుండి తిరిగి తనకు ఇప్పించమన్నాడు. ఏమంటే ఆ కత్తి తమ ఇంట తరతరాలుగా ఉన్నదని, అది తమకు చాలా విలువైనదని కూడా చెప్పాడు. అలా అడిగిన వాడిమీద, తన మీద తన వృత్తిమీద పట్టరాని కోపమూ, అసహ్యమూ ఆయనకు కలిగాయి.
సేకరణ: రామమోహనరాయ్‌