Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 26 2016 @ 10:01AM

మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌

కశ్మీర్‌ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ మరోమారు ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌ ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లో పాక్‌ సైన్యం రాత్రి నుంచి కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో 11 మంది పౌరులకు గాయాలు కాగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాగా... కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ సైన్యానికి భారత జవాన్లు ధీటుగానే బదులు ఇస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిన సంగతి తెలిసిందే.