desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 26 2016 @ 03:21AM

మోదీ మంచి కొడుకు

లఖ్‌నవ్‌, అక్టోబరు 25: ప్రధాని మోదీకి ఊహించని వ్యక్తి నుంచి ఊహించని ప్రశంస వచ్చింది. మోదీ తల్లిని చక్కగా చూసుకునే మంచి కొడుకు అని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రశంసించారు. లఖ్‌నవ్‌లో సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘విధేయత కలిగిన కొడుకు’కు మోదీ రోల్‌ మోడల్‌ అని, తల్లిని ఎంతో గౌరవిస్తారని, ప్రధాని అయినా ఆయన తల్లిని చూడడానికి వెళతారని వ్యాఖ్యానించారు. ‘‘మోదీని చూడండి. కేవలం హార్డ్‌వర్క్‌తోనే ఆయన ప్రధాని అయ్యారు. నిరుపేద కుటుం బం నుంచి వచ్చారు. అయినా, తన తల్లి లేకుండా తాను ఉండలేనని చెబుతూ ఉంటారు. ప్రధాని అయిన తర్వాతా ఆయన తన తల్లిని వదిలిపెట్టలేదు’’ అని వ్యాఖ్యానించారు. కొడుకు అఖిలేశ్‌తో విభే దాల నేపథ్యంలో అతని నుంచి తాను ఏం ఆశిస్తున్నారో ములాయం స్పష్టం చేశారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే సమయంలో, యూపీ ఎన్నికల ముందు, మోదీ, ఆయన కుటుంబ విలువలను ములాయం కొనియాడడంపై బీజేపీ నేతలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.