Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 26 2016 @ 01:52AM

చనిపోతే ఇంటికి తీసుకురమ్మంది

విశాఖపట్నం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మావోయిస్టు నాయకురాలు అరుణ తండ్రి లక్ష్మణరావు విమర్శించారు. 16ఏళ్లుగా ఉద్యమంలో ఉన్న కూతురు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో ఆయన భోరున విలపించారు. చివరిసారిగా 2003లో ఇంటికి వచ్చిన అరుణ.. ‘ఒకవేళ తాను చనిపోతే తీసుకురాకుండా అక్కడే వదిలేయెద్దని కోరిందని’.. గుర్తు చేసుకున్నారు. 4 నెలల క్రితమే కుమారుడు ఆజాద్‌ కూడా ప్రాణాలర్పించారని చెప్పారు.