Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 26 2016 @ 01:30AM

గిరిజనులు, బీసీ అభివృద్ధికి కృషి

  • మంత్రులు ఈటల, చందూలాల్‌, రామన్న 
  •  ఈటలను కలిసిన బీసీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యులు 
హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం బీసీలు, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతోందని మంత్రులు ఈటల రాజేందర్‌, అజ్మీరా చందూలాల్‌, జోగు రామన్న పేర్కొన్నారు. ఆర్థికశాఖ మంత్రి ఈటల మంగళవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో ఈ రెండు శాఖలపై వేర్వేరుగా సమీక్షించారు. మరోవైపు నూతన జిల్లాల్లో నియమితులైన గిరిజన, బీసీ సంక్షేమ శాఖ అధికారులకు ఎంసీహెచ్‌ఆర్డీలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం ముగింపు రోజైన మంగళవారం మంత్రి చందులాల్‌ హాజరై మాట్లాడారు. ఇదిలా ఉండగా.. బీసీ కమిషన్‌ చైర్మన్‌గా, సభ్యులుగా నియమితులైన బీఎస్‌ రాములు, జూలూరు గౌరీశంకర్‌, వకుళాభరణం కృష్ణమోహన్‌, ఆంజనేయగౌడ్‌లు మంగళవారం సచివాలయంలో మంత్రి ఈటలను కలిశారు.