Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 26 2016 @ 00:21AM

జిల్లాకో నవోదయ స్కూల్‌ కావాలి

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో జిల్లాకో నవోదయ స్కూల్‌, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తాజాగా రాష్ట్రంలో హైదరాబాద్‌ జిల్లాలో మినహా మిగతా 9 పాత జిల్లాల్లో జిల్లాకో నవోదయ స్కూల్‌ ఏర్పాటైంది. తాజాగా తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో జిల్లాకో నవోదయ స్కూల్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. గామీణ ప్రాంతాల్లో నెలకొల్పే నవోదయ స్కూళ్లలో ఆ జిల్లాకు చెందిన విద్యార్థులే జిల్లాలోని స్కూళ్లలో ప్రవేశాలకు అర్హులు. ఈ నేపథ్యంలో మిగతా జిల్లాల్లోని విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.