Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 25 2016 @ 19:16PM

హెచ్చరిక : మారకపోతే ఇండియా చేతిలో 5-0 తేడాతో ఓడిపోతారు..

న్యూఢిల్లీ: బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోకపోతే టీమిండియా చేతిలో 5-0 తేడాతో ఓడిపోతారంటూ ఇంగ్లండ్ జట్టును ఆ దేశ మాజీ క్రికెటర్ మైఖెల్ వాన్ హెచ్చరించాడు. ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ టూర్‌లో భాగంగా 5 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది ఇంగ్లండ్ జట్టు. నవంబర్ 9న మొదలై ఫ్రిబ్రవరి 1న ముగుస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టు మొదటి టెస్ట్‌ను 22 పరుగుల తేడాతో అతికష్టం మీద గెలిచింది. దీంతో జట్టు ప్రదర్శన తనకు అంతగా నచ్చకపోవడంతో భారత్‌తో టెస్ట్ సిరీస్‌పై తమ జట్టుకు గట్టి హెచ్చరికే చేశాడు. ఉపఖండపు పిచ్‌లపై భారత్‌ను ఎదుర్కోవడం ఏ దేశానికైనా కష్టమే. తాజాగా భారత పర్యటనలో ఉన్న కివీస్ జట్టును టెస్ట్ సిరీస్‌లో 3-0 తేడాతో వైట్ వాష్ చేసిన కోహ్లీ సేన టెస్టుల్లో తిరిగి నెంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.