Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 25 2016 @ 19:07PM

సరిహద్దులో పాక్ సైన్యం కాల్పులు.. ఏడుగురు మహిళలకు గాయాలు

జమ్మూ: సరిహద్దులో పాకిస్థాన్ ఆర్మీ పెట్రేగిపోతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిత్యం ఉల్లంఘిస్తోంది. మంగళవారం జమ్మూకశ్మీర్ సరిహద్దులోని ఆర్ఎస్‌పురా సెక్టార్‌లోని ప్రజలను టార్గెట్ చేసింది. అత్యాధునిక ఆయుధాలతోపాటు మోర్టార్లను ప్రయోగించింది.
 
దీంతో ఏడుగురు కశ్మీర్ మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. భారత సైన్యం వీరికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. పాక్ కవ్వింపు కాల్పులను బీఎస్ఎఫ్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.