desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 25 2016 @ 18:53PM

మాటకు మాట..లోకేష్ వర్సెస్ జగన్

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీని రాజకీయ ఉన్మాదిగా అభివర్ణించారు. ఇలాంటి ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కల్పిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఒకవైపు ఉద్యోగాలు రావడంలేదని అంటున్నారని, మరోవైపు అమరావతి పనులకు ఆటంకం కల్పిస్తున్నారని, ఇండస్ట్రీలు రాకుండా చేస్తున్నారని, సింగపూర్‌కు ఉత్తరాలు రాసి ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దని చెబుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి అనే చిత్తశుద్ధి ఉన్నవాళ్లయితే ఈరోజున కేంద్రంతో పోరాటం చేసేవారని, ఇటువంటి ఇన్సెంటీవ్స్ కేవలం ప్రత్యేక హోదాతోనే వస్తాయని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదని, వాళ్లే ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టే పరిస్థితి వచ్చేదని జగన్ వ్యాఖ్యానించారు.