Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 3 2016 @ 22:38PM

ఒలింపిక్స్‌లో మనవాళ్లు

ప్రతి అథ్లెట్‌కు ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకోవాలనే కోరిక ఉండటం సహజం. అయినప్పటికీ ఏ మెడల్‌ గెలుచుకున్నా అదీ గొప్పగానే ఉంటుంది. ఒలింపిక్‌ ఆటల్లో ఒకటి రెండు కాకుండా మల్టిపుల్‌ మెడల్స్‌ గెలుచుకున్న మహిళలు కొందరు ఉన్నారు. ఆ మహిళా అథ్లెట్‌ల గురించి...

  • లారిసా లాటినిన. 18 మెడల్స్‌ గెలుచుకున్నారు. మాజీ సోవియట్‌ జిమ్నాస్ట్‌. 1956 - 1964 మధ్య కాలంలో పధ్నాలుగు వ్యక్తిగత, నాలుగు టీం మెడల్స్‌ గెలుచుకున్నారు. ఆమె సృష్టించిన రికార్డు 48 సంవత్సరాల పాటు మరెవరూ బ్రేక్‌ చేయలేదు. 













  • బర్జిట్‌ ఫిష్చర్‌ 12 పతకాలు గెలుచుకున్నారు. జర్మనీ (పూర్వం తూర్పు జర్మనీ)కి చెందిన ఈమె పేరున్న మహిళా కనోయిస్ట్‌. ఆరు వేరు వేరు ఒలింపిక్‌ గేమ్స్‌లో ఎనిమిది బంగారు పతకాలు గెలుచుకున్నారు. అయితే ఈ రికార్డును అలాదార్‌ గెరెవిచ్‌తో పంచుకున్నారు. ఏడు ఒలింపియాడ్‌లలో: రెండు సార్లు ఈస్ట్‌ జర్మనీకి, నాలుగు సార్లు రియునైటెడ్‌ నేషన్‌కి రిప్రజెంట్‌ చేశారు. ఈమె యంగెస్ట్‌ - ఓల్డెస్ట్‌ ఒలింపిక్‌ కనోయింగ్‌ ఛాంపియన్‌. 1978 - 2005 మధ్య 38 ఐసిఎఫ్‌ కానో స్ర్పింట్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ మెడల్స్‌ గెలుచుకున్నారు. అందులో 28 బంగారు పతకాలే. 





  • జెన్నీ థాంప్సన్‌. 12 మెడల్స్‌. ఎనిమిది గోల్డ్‌ మెడల్స్‌. ఒలింపిక్‌ చరిత్రలోనే ఎక్కువ స్విమ్మింగ్‌ మెడల్స్‌, గోల్డ్‌ మెడల్స్‌ గెలుచుకున్న ఘనత ఈవిడది. గెలుచుకున్న 12 మెడల్స్‌లో ఎనిమిది బంగారు మెడల్స్‌ కాగా వాటిని 1992, 1996, 2000, 2004 సంవత్సరాల్లో జరిగిన సమ్మర్‌ ఒలింపిక్స్‌లో సాధించారు. 1987లో అంతర్జాతీయంగా జరిగిన ఆటల్లో పాల్గొన్నప్పుడు ఆమె వయసు పధ్నాలుగేళ్లు. పాన్‌ అమెరికన్‌ గేమ్స్‌లో 50- మీటర్‌ ఫ్రీ స్టయిల్‌లో గెలుపొంది, 100- మీటర్‌ ఫ్రీస్టయిల్‌లో మూడోస్థానంలో నిలిచారు. మొట్టమొదటి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను 1991లో గెలుచుకున్నారు.4్ఠ100- మీటర్‌ ఫ్రీస్టయిల్‌ రియల్‌టీంలో భాగంగా ఈ విజయం దక్కింది. 



  •  ఒలింపిక్స్‌లో మన దేశ మహిళలు కూడా ఎందరో పాల్గొన్నారు. పాల్గొంటున్నారు. అయితే మొట్టమొదటి ఒలింపిక్‌ మెడల్‌ గెలుచుకున్న మహిళ మాత్రం కరణం మల్లీశ్వరి. సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్‌లో 69 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో కాంస్య పతకం గెలుచుకున్నారు. 





  •  లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో మొదటిసారి మహిళా బాక్సింగ్‌ స్పోర్ట్‌ను ప్రవేశపెట్టారు. మనదేశం తరపున ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌ పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు క్వాలిఫై అయిన భారతీయ మహిళల్లో ఈమె ఒక్కరే ఉండడం విశేషం. మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 





  •  సైనా నెహ్వాల్‌. ఒలింపిక్స్‌లో జరిగిన బ్యాడ్మింటన్‌ పోటీల్లో పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ. లండన్‌లో 2012లో జరిగిన ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 





  •  గీతా ఫోగట్‌. 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ మహిళా విభాగంలో 55 కేజీల్లో పాల్గొనేందుకు ఎంపికైన మొదటి భారతీయ మహిళ. 2004 నుంచి మహిళా రెజ్లింగ్‌ను పోటీల్లో చేర్చారు.