desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 3 2016 @ 11:33AM

కొండను ఢీకొట్టి 20 మంది ప్రాణాలను కాపాడాడు

డ్రైవర్‌ సమయస్ఫూర్తితో తప్పిన పెనుప్రమాదం
అనంతగిరి/అనంతగిరి రూరల్‌, ఆగస్టు 2: విశాఖ ఏజెన్సీలోని అనంతగిరి ఘాట్‌రోడ్డులో మంగళవారం టూరిస్టు బస్సు ఒకటి బోల్తా పడడంతో పది మంది పర్యాటకులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే బస్సు డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు, బండారం గ్రామాలకు చెందిన 20 మంది బస్సులో విశాఖ ఏజెన్సీ సందర్శనకు వచ్చారు. బస్సు బొర్రాగుహల రహదారిలోని రైల్వే గేటు వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌ బ్రేక్‌ వేయగా పడలేదు. దీంతో అతను వెంటనే అప్రమత్తమై బస్సును సమీపంలో వున్న కొండ వైపు తిప్పాడు. దీంతో బస్సు కొండను ఢీకొని రహదారిపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దినేష్‌రాజు, జి.సునీత, అనంతలక్ష్మి, వెంకటరత్నం, రాజేష్‌, మాధవ్‌, వంశీ, ప్రసాద్‌, సుమ, ప్రవీణ్‌తేజ, నిరోష్‌రాజులకు గాయాలయ్యాయి. వారిని ప్రైవేటు వాహనాలలో విశాఖ తరలించారు. బస్సు డ్రైవర్‌ చాకచక్యంతో వ్యవహరించి కొండను ఢీకొట్టకుంటే బస్సు లోయలో పడి వుండేదని ప్రయాణికులు తెలిపారు.