desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 15 2016 @ 17:57PM

ఆయన నీతి కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశారు: బాబు

విజయవాడ: సొంత రాష్ట్రానికి ఎక్కువ సహాయం చేస్తున్నారని ఆరోపణలు వస్తే నీతి తప్ప పదవి ముఖ్యం కాదని .. ఎంపీ పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి కేఎల్ రావు అని సీఎం చంద్రబాబు కొనియాడారు. కేఎల్ రావు జయంతి సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప గొప్ప ఇంజనీర్లకు కేఎల్‌ రావు స్ఫూర్తి అని అన్నారు. కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతున్నామని, ఏడాదిలో పట్టిసీమను పూర్తిచేసి గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని చంద్రబాబు చెప్పారు.