Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 28 2016 @ 00:29AM

సొరియాసిస్‌కు సంపూర్ణ చికిత్స

ప్రపంచ జనాభాలో ‘సోరియాసిస్‌’ బాధితుల సంఖ్య నేడు 3శాతం దాకా ఉన్నట్లు వరకు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. సొరియాసిస్‌ వ్యాధి రోగి మరణానికి దారి తీయదు కానీ సొరియాసిస్‌ జబ్బుతో ఏళ్ల తరబడి బాధపడటం వలన ఇది సామాజిక రుగ్మతకు, మానసిక ఆశాంతికి దారి తీస్తుంది. చాలా మంది చర్మరోగులు సొరియాసి్‌సను ఒక సాధారణ చర్మ వ్యాధిగానే భావిస్తారు. కానీ ఇది మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ వికటించడం వలన వచ్చే చర్మ వ్యాధి అన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ జబ్బును కేవలం పై పూతలతో పూర్తిగా నయం చేయలేము.

 
సొరియాసిస్‌ అనేది దీర్ఘకాలికంగా కొనసాగే ఆటోఇమ్యూన వ్యాధి. అనగా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఒక్కోసారి పొరబడి సొంత చర్మ కణాలపై దాడి చేయడం వల్ల జరిగే పరిణామాల వల్లనే ‘సొరియాసిస్‌’ వస్తుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అంటువ్యాధి కాదు. కాకపోతే, ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంది.
సాధారణంగా మన చర్మం రెండు పొరలతో నిర్మితమై ఉంటుంది. బయటి పొరను ఎపడెర్మిస్‌ అని, లోపలి పొరను డెర్మిస్‌ అని అంటారు. సుమారు నెలరోజులకొకసారి డెర్మి్‌స్‌లో తయారైన కొత్తకణాలు ఎపిడెర్మిస్‌లోకి చేరుకుంటాయి. కాని సొరియాసిస్‌ వ్యాధిలో కణాలు తయారమ్యే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. కొత్త కణాలు తయారై చర్మం పైభాగానికి వచ్చేస్తుంటాయి. అధికంగా వచ్చేసిన ఆ కణాలు పేరుకుపోయి బిళ్లల మాదిరిగా తయారవుతాయి. చూడటానికి వెండి రంగుపొలుసుల్లా కనిపిస్తాయి. సొరియాసిస్‌ ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు అరిచేతులు, అరికాళ్లు, ఉదరంపై ప్రభావితం చేస్తుంది. సొరియాసి్‌సతో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్‌ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌’ అని అంటారు.
కారణాలు
జన్యుపరమైన కారణాల వలన గానీ, లేదా మానసిక ఒత్తిడి వలన గానీ ఈ వ్యాధి రావచ్చునన్న విషయం అనుభవపూర్వకంగా అంగీకరించబడింది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడిన అసమతుల్యతల కారణంగా కూడా ఈ వ్యాధి రావచ్చు మరియు దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం కూడా సొరియాసిస్‌ కారణం కావచ్చు.
లక్షణాలు
చర్మం ఎర్రబడటం, సాధారణం నుంచి అతి తీవ్రమైన దురద, చర్మంపైపొర వెండి రంగు పొలుసులుగా ఊడిపోవడం, సొరియాసిస్‌ తలలో ఉన్నప్పుడు పొలుసులు రాలడంతో బాటు జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారినపుడు చర్మంపై పగుళ్లు ఏర్పడటంతో పాటు రక్తస్రావం కావడం ఉంటాయి. సొరియాసిస్‌ గోళ్లను ప్రభావితం చేయటం జరిగితే అవి పెళుసుబారి దృఢత్వాన్ని కోల్పోయి త్వరగా విరిగిపోతాయి. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు కీళ్ళు ప్రభావితమై తద్వారా కీళ్ల నొప్పులు మొదలవుతాయి.
నిర్థారణ పరీక్షలు
సిబిపి, ఈఎ్‌సఆర్‌, స్కిన బయాప్సీ, సొరియాసిస్‌ కీళ్లను ప్రభావితం చేసినప్పుడు ఎక్స్‌రే మొదలగు పరీక్షలు చేయించాలి. సాధారణంగా అనుభవజ్ఞులైన డాక్టర్లు రోగి చర్మ లక్షణాలను నిశితంగా పరిశీలించిన మీదట రోగనిర్ధారణ చేస్తారు.
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ చికిత్స
చాలా మంది సొరియాసిస్‌ రోగులు ఆతృతతో వైద్యులను, వైద్య విధానాలను త్వరితకాలంలో మార్చేస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. సొరియాసిస్‌ ఒక దీర్ఘకాలిక వ్యాఽధి కాబట్టి క్రమం తప్పకుండా కొంతకాలంపాటు వైద్యం తీసుకుంటేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్‌ కాన్సటిట్యూషనల్‌ సిమిలియం విధానం ద్వారా సొరియాసిస్‌ రోగి వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకుని తద్వారా వికటించిన అతని రోగనిరోధక వ్యవస్థను సరిచేసి ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా సొరియాసి్‌సను సంపూర్ణంగా నయం చేయవచ్చు.
-డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌
Founder Chairman
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు