desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 28 2016 @ 00:25AM

థైరాయిడ్‌ సమస్యకు తిరుగులేని వైద్యం

ఈ రోజుల్లో అత్యంత వేగంగా విస్తరిస్తున్నది థైరాయిడ్‌ వ్యాధి. వాతావరణ కాలుష్యాల వల్ల కావచ్చు. మారిన జీవనశైలి వల్ల కావచ్చు ఈ థైరాయిడ్‌ సమస్యలు అత్యధికుల్ని వ్యాధిగ్రస్తం చేస్తున్నాయి. థైరాయిడ్‌ సమస్య రావడానికి నానాటికి పెరుగుతున్న మానిసిక ఒత్తిళ్లు, సమస్యలు కూడా కారణమవుతున్నాయి. పురుషులకన్నా సీ్త్రలే ఎక్కువ మంది ఈ సమస్యల బారిన పడుతుంటారు. సకాలంలో వైద్య చికిత్సలు తీసుకుంటే ఈ సమస్య సమూలంగానే తొలగిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇది జీవితాన్నే నిర్జీవంగా మార్చేస్తుంది.

 
థైరాయిడ్‌ గ్రంధి మానవుని కంఠం భాగంలో కాలర్‌ ఎముక పైభాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది ఒక అంతస్రావ గ్రంధి. ఇది టి-3, టి-4, టిఎ్‌సహెచ్‌ కాల్సిటోనిన్‌ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.. ఇది మానవుని జీవరసాయన క్రిములను నియంత్రిస్తుంది.
థైరాయిడ్‌ హార్మోన్లు - పరిమాణం
  • టి-3 (ట్రై అయిడో థేరోననిన్‌)-80- 180 ఎంజి/డిఎల్‌
  • టి-4 (థైరాక్సిన్‌)- 4.5- 12.5 ఎంజి/డిఎల్‌
  • టిఎస్ హెచ్‌ (థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌) - 0.5- 5.5 ఎంఐయు/ఎల్‌
రెండురకాలు
హైపోథైరాయియిడిజం, హైపర్‌ థైరాయిడిజం అంటూ ఈ సమస్య రెండు రకాలు. అయితే, హైపో థైరాయిడిజంలో థైరాయిడ్‌ గ్రంధి తగిన మోతాదులో టి-3 లేదా టి- 4 హార్మోన్లను ఉత్పత్తి చేయలేకపోతుంది.
సమస్య కారణాల్లో.....
హాషిమోటోస్‌ థైరాయిడైటిస్‌
ఇదొక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. రక్షణ వ్యవస్థ సొంత గ్రంధిపై దాడిచేయడమే ఇక్కడ సమస్య,. దీనివల్ల థైరాయిడ్‌ గ్రంధి పరిణామం పెరుగుతుంది. అలా పెరగడాన్ని గాయిటర్‌ సమస్య అంటారు. ఈ సమస్య చివరికి గ్రంధి నాశనానికి దారి తీస్తుంది.
సబ్‌ -ఎక్యూట్‌ థైరాయిడైటిస్‌
ఇది సాధారణంగా థైరాయిడ్‌ గ్రంధిలో వాపు ఏర్పడటం వల్ల గానీ, గర్భధారణ సమయంలో గానీ వస్తుంది. ఇది స్వల్పకాలమే ఉంటుంది కాబట్టి థైరాయిడ్‌ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఇవే కాకుండా, ఏ కారణంగానైనా థైరాయిడ్‌ గ్రంధిని తొలగించడం, డ్రగ్స్‌ వాడకం, హైపో థలామస్‌, పిట్యూటరీ గ్రంధి వ్యాధులు, ఆయోడిన్‌ లోపాల వంటి సమస్యల కారణంగా కూడా థైరాయిడ్‌ సమస్యలు రావచ్చు.
హైపోథైరాయిడిజం లక్షణాలు
నీరసం, చలికి తట్టుకోలేకపోవడం, మలబద్దకం, కండరాల నొప్పులు, బరువు పెరగడం లేదా తగ్గకపోవడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. వీటితో పాటు, థైరాయిడ్‌ వాపు (గాయిటర్‌), చర్మం పొడిబారడం, జుట్టు బిరుసుగా తయారవ్వడం లేదా జుట్టు రాలిపోవడం, కళ్లు,ముఖాల్లో వాపు, బొంగురు గొంతు, నెలసరి సమస్యలు/ అధిక రక్తస్రావం, మానసికంగా కుంగిపోవడం, ర క్తంలో కొలెసా్ట్రల్‌ పెరగడం వంటి లక్షణాలు ఈ హైపో థైరాయిదిజంలో కనిపిస్తాయి.
హైపర్‌ థైరాయిడిజం లక్షణాలు
మానసిక ఆంధోళన, చిరాకు, గుండెదడ, గుండె వేగంగా కొట్టుకోవడం, వేడి తట్టుకోలేకపోవడం లేదా చెమటలు ఎక్కువగా రావడం, వణుకు, బరువు తగ్గడం, ఆకలి పెరగడం, విరేచ నాల వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు కాలికింది భాగంలో వాపు, పక్షవాతం రావడం, ఊపిరి అందకపోవడం, రుతుస్రావం తగ్గడం, సంతానలేమి, నిద్రపట్టకపోవడం, కంటి చూపులో ఇబ్బందులు, నీరసం, థైరాయిడ్‌ గ్రంధిలో వాపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
హోమియోపతి విశిష్ఠత
కేవలం వ్యాధి లక్షణాలను మాత్రమే కాకుండా, హోమియోపతి శరీర తత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని చికిత్స చేస్తుంది. రోగి పథాలజీ, కుటుంబ చరిత్ర, మానసిక లక్షణాలు, తదితర అన్ని విషయాల్నీ పరిగణనలోకి తీసుకుని, చికిత్స చేసే ఈ విధానం వల్ల వ్యాధి నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించడం మాత్రమే కాకుండా, వ్యాధి సమూలంగా తొలగిపోతుంది.



-డాక్టర్‌ ఎ.ఎం.రెడ్డి, పాజిటివ్‌ హోమియోపతి,
ఫోన్‌: 92461 99922
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు
డాక్టర్‌తో మాట్లాడాలంటే
ఫోన్‌: 92461 66333