Mar 28 2016 @ 00:18AM

కిడ్నీలో రాళ్లు హోమియోతో మాయం

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం అన్నది ఈ మద్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతోంది. ఇటీవలి ఒక సర్వే ప్రకారం భారతదేశంలో 10. 6 శాతం మంది పురుషులు, 7.1 శాతం మంది స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. మారిన జీవనశైలి, మారిన అహారపు అలవాట్లు, స్థూలకాయం వంటి వి ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. వాస్తవానికి మన శరీరం ఒక భారీ కర్మాగారం. ఇందులో నిరంతరం రకరకాల జీవ క్రియలు జరిగిపోతుంటాయి. ప్రత్యేకించి శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటికి పంపడంలో మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం కీలకపాత్ర పోషిస్తుంటాయి. అయితే అత్యధికంగా అంటే 90 శాతం మలినాలను విసర్జించేవి మూత్రపిండాలే. ఇవి రక్తంలోని విషపదార్థాలనే కాకుండా, శరీరంలో అదనంగా నిలిచి ఉన్న నీటిని కూడా బయటికి పంపుతుంటాయి. మొత్తంగా చూస్తే రోజూ దాదాపు 200 లీటర్ల రక్తాన్ని కిడ్నీలు వడపోస్తుంటాయి. ఈ వడపోత క్రియకు శరీరంలో నీరు ఇతర ద్ర వపదార్థాలు సరిపడా ఉండాలి. అయితే, నేటి ఉరుకూ పరుగుల జీవితంలో చాలా మంది సరిపడా నీళ్లు కూడా తాగలేకపోతున్నారు. ఇదే ప్రధాన కారణంగా చాలా మంది కిడ్నీ రాళ్ల సమస్యతో సతమతమవుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ రాళ్లు చిన్నవిగానే ఉండి మూత్రం ద్వారా విసర్జింపబడతాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం రాళ్లు పెద్దవిగా ఉంటూ మూత్రనాళంలో చిక్కుబడి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.
ఇవీ కారణాలు

 • అధిక బరువు, నీటిని, ద్రవపదార్థాలను సరిపడా తీసుకోకపోవడం
 • మూత్రపిండాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లు
 • జన్యుపరమైన ఇన్‌ఫెక్షన్లు
 • ఎక్కువ వేడిగా ఉండే వాతావరణంలో ఉండడం
 • వంశపారంపర్య మూలాలు
 • కొన్ని రకాల మందుల్ని దీర్ఘకాలికంగా వాడటం
ఇవి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి గల ప్రధాన కారణాలు
ఎలా తెలుస్తుంది?
 • పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి
 • నీరసం, వికారం, తీవ్రమైన జ్వరం
 • విపరీతమైన చెమటలు, బరువు తగ్గడం
 • మూత్రంలో రక్తం పడటం (హిమచ్యూరియా)
 • మూత్రంలో మంట రావడం
 • మూత్రం చీము రావడం (పై యూరియా)
నివార ణా మార్గాలు
 • నీటిని ఎక్కువగా తాగాలి. నీరుగానీ, ఇతర ద్రవపదార్థాలు గానీ మొత్తంగా రోజుకు 4 లీటర్లకు తగ్గకుండా తీసుకోవాలి.
 • కిడ్నీలో అప్పటికే ఆక్సిలేటివ్‌ రాళ్లు ఉంటే ఆక్సిలేట్‌ ఉండే చాక్‌లేట్‌, పాలకూర, సోయా, ఎండు చిక్కుడు దాన్యాల్లాంటివి తీసుకోకూడదు.
 • క్యాల్షియం పిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. అందువల్ల అవి శరీరానికి లభించే ఆహార పదార్థాలు తీసుకోవాలి.
 • కూల్‌డ్రింకులను ఏ మాత్రం తీసుకోకూడదు.
నిర్ధారణా పరీక్షలు
కిడ్నీ ఎక్స్‌రే, అల్ర్టాసౌండ్‌ స్కాన్‌, కిడ్నీ పరీక్ష, రక్తపరీక్ష, మూత్రపరీక్ష
హోమియో చికిత్స
హోమియోపతిలో శారీరక మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని సర్జరీ అవసరం లేకుండానే రాళ్లను తొలగించే చికిత్సలు ఉన్నాయి. కిడ్నీలోని రాళ్ల పరిమాణమెంత? అవి ఏ వైపున ఉన్నాయి? అనే అంశాల ఆధారంగా ఇచ్చే మంచి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి బెరిబెరి వల్గారిస్‌, సర్సఫరిల్లా, కాల్కేరియా కార్బ్‌, కోలోసింత వంటి మందులు ఈ చికిత్సలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అయితే నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ మందలు వాడవలసి ఉంటుంది.

-డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి.
హోమియో, స్టార్‌ హోమియోతి,
ఫోన్‌- 8977 336677,
టోల్‌ర ఫీ :1800-108-5566
www.starhomeo.com
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక