desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Feb 28 2016 @ 10:45AM

జేఎన్‌యూ విద్యార్థి కన్నయ్యపై సరూర్‌నగర్‌ పీఎస్‌లో కేసు నమోదు

 హైదరాబాద్ : ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రు యూనివర్సిటీ విద్యార్ధి కన్నయ్యపై హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం కేసు నమోదైంది. కన్నయ్యతోపాటు ఉమర్‌ఖలీద్‌ అనే మరో విద్యార్ధి సహా తొమ్మిది మందిపై 124, 124 ఏ, ఐపీసీ 156, 3సీఆర్పీసీ కింద కేసులు నమోదు చేశారు. జేఎన్‌యూలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఎల్బీనగర్‌ కోర్టులో జనార్దన్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.