Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Feb 28 2016 @ 10:33AM

జగన్‌కు హ్యాండ్‌ ఇచ్చిన ఎమ్మెల్యే డేవిడ్‌ రాజు

విజయవాడ : ఏపీలో ఆపరేషన్‌ నేపథ్యంలో వైసీపీలో కలకలం రేగుతోంది. పార్టీ వీడబోనని చెప్పిన రెండోరోజే ఆ పార్టీ ఎమ్మెల్యే డేవిడ్‌ రాజు జగన్‌కు హ్యాండ్‌ ఇచ్చారు. జగన్‌ పూర్తిగా ఇదే అంశంపై దృష్టి పెట్టి ఎమ్మెల్యేలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న సమయంలోనే డేవిడ్‌ రాజు పార్టీ వీడడం ఆ పార్టీ సీనియర్‌లను నివ్వెర పరిచింది. దీంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలతో సీరియస్‌గా చర్చించాలంటూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ వైసీపీ సీనియర్‌ నేతలను ఆదేశించారు.

ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఒక ఎత్తు అయితే డేవిడ్‌ రాజు పార్టీ మారడం మరొక ఎత్తు. డేవిడ్‌ రాజు శుక్రవారం జగన్‌ను కలిశారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారవద్దని సూచించారు. జరిగి 48 గంటల్లోనే రాజు ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడును కలిసి టీదీపీలోకి చేరటం వైసీపీలో తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దీంతో ఆ పార్టీ సీనియర్‌ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలియవచ్చింది. ప్రకాశం జిల్లా నుంచి వలసలు వస్తాయని మొదటి నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రేపు కూడా మరికొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. తమ నియోజక వర్గాల అభివృద్ధి కోసమే టీడీపీలోకి చేరుతున్నట్లు ఎమ్మేల్యేలు పేర్కొన్నారు.