Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Feb 28 2016 @ 10:27AM

ముగ్గురు పిల్లలను హత్య చేసి.. కోర్టు శిక్షల నుంచి తప్పించుకుంది.

టి.నగర్‌ : కటికదారిద్య్రం కారణంగా ముగ్గురు పిల్లలను హత్య చేసి ఆత్మాహత్యాయత్నం చేసిన మహిళకు దిగువ కోర్టు విధించిన మూడు యావజ్జీవ కారాగార శిక్షలను హైకోర్టు రద్దు చేసింది. సేలంలో 2008లో జయలక్ష్మి అనే మహిళ పేదరికం భరిం చలేక తన ముగ్గురు పిల్లల్ని బావిలోకి తోసి హత్య చేసింది. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరిపారు. ఈ కేసుపై సేలం ఫాస్ట్ర్ టాక్  కోర్టులో విచారణ జరిగింది. విజయలక్ష్మికి మూడు యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తూ తీర్పువెలువడింది. విజయలక్ష్మి ఆ తీర్పు ను సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఈ అప్పీలుపై న్యాయమూర్తులు నాగముత్తు, జయచంద్రన విచారణ జరిపి, పిటీషనర్‌ విజయలక్ష్మి పేదరికానికి తోడు తీవ్ర మానసికి ఒత్తిళ్లకు లోనై తన ముగ్గురు పిల్లలను హత్య చేసినట్లు అవగతమవుతోందని పేర్కొంటూ దిగువ కోర్టు ఆమెకు విధించిన మూడు యావజ్జీవ కారాగార శిక్షలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.