desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Feb 27 2016 @ 09:49AM

వెబ్ వి'వాహ్'

పెళ్లికి ఇంటిల్లిపాది పనిచేసినా కూడా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం. ఒక్కోసారి పెళ్లిమండపానికి వెళ్లాక కూడా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ హడావిడికి తాళం పెట్టాలనుకునే చాలామంది వెడ్డింగ్‌ ప్లానర్స్‌ను సంప్రదిస్తుంటారు. ఇదంతా రోటీన ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని సగం పెళ్లి చేసేస్తున్నాయి ఆన్‌లైన్ కంపెనీలు.

-ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ
పెళ్లికి పనులు పూర్తిచేయడానికి ఎన్ని నెలల సమయం ఇచ్చినా సరిపోదు. వధూవరులతో సహా వారి తల్లిదండ్రులు, చుట్టాలు, స్నేహితులూ...ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక పనులతో బిజి బిజీగా ఉంటారు. అయితే ఈ పనులకు చెక్‌ పెట్టి హాయిగా రెస్ట్‌ తీసుకోమంటోంది ఓ ఆనలైన బేస్డ్‌ వెడ్డింగ్‌ సంస్థ. పెళ్లిపత్రికలు, మండపాలు, హోటళ్లు, క్యాటరింగ్‌, బ్యూటీషియన్లు, ఫ్యాషన డిజైనర్ల వంటి 14 రకాల సేవలను అందిస్తూ వెడ్డింగ్‌ ఇండస్ట్రీ‌లో ఈ సంస్థ దూసుకుపోతోంది. ఇక ఈ మధ్య యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న డెస్టినేషన వెడ్డింగ్‌తో సహా, టాప్‌ హనీమూన ప్రదేశాల వరకు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు..వంటి 14 నగరాల్లో తమ సేవలను ఈ 7వచన అందిస్తోంది.
 
ఆన్‌లైన్‌లో అంతా...
ఒక్కసారి ఈ వెబ్‌సైట్‌లోకి వెళితే, అక్కడ వివిధ అంశాలకు సంబంధించి క్యాటగిరీలు ఉంటాయి. అక్కడ మనం ఎంచుకున్న నగరాన్ని బట్టి మనకు అక్కడ సేవలందించే వివిధ సంస్థల వివరాలు దొరుకుతాయి. వివరాలతో పాటు ధరలు కూడా అక్కడే కనిపిస్తాయి. కాబట్టి పెళ్లికి మనం ఎంచుకున్న బడ్జెట్‌కు తగ్గ మండపాలను, ఫోటోగ్రాఫర్లను, క్యాటరర్స్‌ను ఎంచుకోవచ్చు. పెళ్లి నిశ్చయమైన రోజు నుంచి పెళ్లి కార్యక్రమాలన్ని పూర్తయ్యే వరకు మీతోనే ఉంటూ, ప్రతి సందర్భాన్ని తమ కెమెరాల్లో బంధించే ఫోటోగ్రాఫర్లు, ఇంటికి మీ దుస్తులను తెచ్చిచ్చే, ఫ్యాషన డిజైనర్లు, ఏకార్డు ఎంత బావుంటుందో చూపించే ఇన్విటేషన మేకర్స్‌ వంటి ఎంతో మంది ఈ ఆనలైన సంస్థ ద్వారా మనకు లభిస్తారు.

సాఫీగా...
ఈ సంస్థ ద్వారా ఇంతకు ముందు లాగా పెళ్లి అనగానే పుట్టే ఓ సరకమైన కంగారు, హడావిడి తగ్గుతాయి. పెళ్లి బాధ్యతలను నమ్మకస్తులకు అప్పగించినపుడు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. సమయానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ఎటువంటి అవాంతరాలు లేకుండా పెళ్లి జరిపిస్తారు వీరు. కూర్చున్న చోటికే ప్రతీది వస్తున్నప్పుడు 7వచనలాంటి ఆనలైన వెడ్డింగ్‌ సంస్థలను ఎంచుకునేందుకు సంకోచించాల్సిన అవసరం అస్సలు లేదు. ఏర్పాట్ల గురించి పైపెన తెలుసుకుంటూ, చూసుకుంటుంటే చాలు.
 
నేలకు దిగిన ధరలు...
ఇప్పటి వరకు 7వచన, కేవలం కోటి రూపాయలు, ఇంకా ఆపైన బడ్జెట్‌ గల పెళ్లిళ్లకు మాత్రమే తమ సేవలను అందిస్తోంది. అయితే ఇక మీదట మాత్రం మధ్య, సామాన్య తరగతి బడ్జెట్‌ పెళ్లిళ్లకు సైతం తమ సేవలను అందించనుంది. దీని కోసం దేశంలోని అన్ని నగరాలలోని కళ్యాణ మండపాలతో ఒప్పందాలు చేసుకుంటోంది 7వచన యాజమాన్యం. ఇక్కడ డబ్బులు చెల్లించే విధానంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెబ్‌సైట్‌లో కావల్సిన ఆర్డర్‌ను ఎంచుకున్నాక 25 శాతం సొమ్ము చెల్లించాలి. ఆ తరువాత నెట రోజుల ముందు మరో 25 శాతం. కార్యక్రమం రోజు, పూర్తయ్యాక మిగతా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి నెలా కోటి రూపాయలకు పైగా టర్నోవర్‌ నమోదు చేస్తున్నాం. ఇప్పటి వరకు విడతలుగా రూ.3.5 కోట్లు నిధులను సమీకరించింది ఈ సంస్థ.