desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 23 2015 @ 03:34AM

అదనపు హజ్‌ స్లాట్ల కోసం కేసీఆర్‌ లేఖ

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): హజ్‌ యాత్రకోసం హైదరాబాద్‌కు అదనంగా 2 వేల స్లాట్ల్లను కేటాయించాలని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ను సీఎం కేసీఆర్‌ కోరారు. ఈ మేరకు గురువారంనాడు ఆయన లేఖ రాశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి 5580 కేటాయించగా.. దాన్ని ఈ ఏడాది ఇరు రాష్ట్రాలకు కలిపి 4945కు కుదించడం ఆశ్యర్యాన్ని కలిగించిందన్నారు. వాస్తవానికి తెలంగాణలో హజ్‌ సీట్లకు డిమాండ్‌ ఎక్కువ.. మిగతాచోట్ల ప్రతి స్లాటుకు 12 మంది వేచి ఉండగా.. హైదరాబాద్‌లో ఒక స్లాటుకు 23 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు అదనపు స్లాట్లు కేటాయించాలని సీఎం కోరారు.