desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 23 2015 @ 03:33AM

దళితుడిని సీఎం చేసే వరకూ ఉద్యమం

మాలమహానాడు అధ్యక్షుడు రామ్మూర్తి
జహీరాబాద్‌, మార్చి 22: ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం టీఆర్‌ ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వెంటనే దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని తె లంగాణ మాలమహానాడు అధ్యక్షుడు పసుల రామ్మూర్తి డిమాండ్‌ చేశారు. ఆది వారం మెదక్‌ జిల్లా జహీరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ దళితుడిని ము ఖ్యమంత్రి చేసే వరకు ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ చైర్మన్‌ పిడమర్తి రవిలు పద్ధతి మార్చుకోవాలని సూచించారు. 59కులాలు వేసిన భిక్షతో వచ్చిన పదవులను ఒక మాదిగ కులాని కి పరిమితం చేసి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బడ్జెట్‌లో ఈ సంవత్సరం దళితులకు జనాభా దామాషా ప్రకారం రూ.17వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా రూ. 8,089 కోట్లు కేటాయించి దళితుల అభ్యున్నతిని అడ్డుకున్నారని విమర్శించారు.