Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 23 2015 @ 00:49AM

ఉమేష్‌ విజయం వెనుకా ఆ ఇద్దరే..

నాగ్‌పూర్‌: ఈ ప్రపంచకప్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది టీమిండియా బౌలింగ్‌ విభాగమే. అంతకుముందు ఆస్ర్టేయాతో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌ల్లో విఫలమైనా ప్రపంచకప్‌నకు వచ్చేసరికి మాత్రం గేర్‌ మార్చి ఏడింటికి ఏడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థులను ఆలౌట్‌ చేసింది. ముఖ్యంగా మహ్మద్‌ షమి-ఉమేష్‌ యాదవ్‌ జోడీ ఆదిలోనే వికెట్లు తీస్తూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతోంది. ఈ టోర్నీలో షమితో పాటు కొత్త బంతిని పంచుకుంటున్న ఉమేష్‌ ఏడు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌, వన్డే సిరీస్‌ల్లో విఫలమైన ఈ విదర్భ పేసర్‌ ప్రపంచకప్‌లో చెలరేగడానికి కారణం పాకిస్థాన్‌కు చెందిన వసీం అక్రమ్‌, షోయబ్‌ అక్తరేనని అతని సోదరుడు రమేష్‌ యాదవ్‌ తెలిపాడు. పేస్‌, బౌన్స్‌కు అనుకూలించే ఆసీస్‌ పిచ్‌లపై ఎలా బౌలింగ్‌ చేయాలో అక్రమ్‌... ఉమేష్‌కు సూచించాడని అతను చెప్పాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు ఆడేటప్పుడు ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ వసీం అక్రమ్‌తో కలిసి పనిచేయడమే ఉమేష్‌ కెరీర్‌లో కీలక మలుపని రమేష్‌ తెలిపాడు. ఉమేష్‌కు ఎప్పుడు సందేహాలున్నా ఇప్పటికీ అక్రమ్‌కే ఫోన్‌ చేస్తాడని చెప్పాడు. ఇక మ్యాచ్‌కు ముందు మానసికంగా ఎలా సంసిద్ధమవ్వాలనే విషయంలో అక్తర్‌ విలువైన సలహాలిచ్చినట్టు ఉమేష్‌ తనకు చెప్పాడన్నాడు.