Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 22 2015 @ 11:47AM

రాయ్ లక్ష్మీకి రీమేక్ తో అదృష్టం కలిసొస్తుందా ?

కోలీవుడ్, టాలీవుడ్ లలో అవకాశాలు దక్కించుకోవడానికి ఎంతగానో కష్టపడుతున్న హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మికి అనుకోని ఆఫర్ వచ్చింది. బెంగళూరు డేస్ తమిళ వర్షన్ లో ఈ అందాల భామకుఛాన్స్ ఇచ్చారు దర్శకనిర్మాతలు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆర్య, రానా, శ్రీదివ్యతో పాటు రాయ్ లక్ష్మీ కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాకు సైన్ చేశానని... సినిమాలో తనది ముఖ్యపాత్ర అంటూ ట్విట్టర్ లో వెల్లడించింది ఈ హాట్ లేడీ. అయితే తన క్యారెక్టర్ ఏంటనే విషయంపై మాత్రం అమ్మడు ఎలాంటి హింట్ ఇవ్వలేదు. కోలీవుడ్ లో అనుకోకుండా ఈ అవకాశం రావడంతో.. మళ్లీ తనకు చెన్నై నుంచి అవకాశాలు పెరుగుతాయని భావిస్తోంది ఈ కన్నడ కస్తూరి. బెంగళూరు డేస్ కోలీవుడ్ రీమేక్ లో ప్లేస్ దక్కించుకున్న ఈ అందాల భామకు.. తెలుగు వర్షన్ లోనూ చోటు వస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుగులోనూ రీమేక్ కానున్న ఈ సినిమా స్టార్ కాస్టింగ్ కు సంబంధించి.. ఇప్పటికీ క్లారిటీ రాలేదు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ సినిమాలో ఎవరెవరు యాక్ట్ చేయబోతున్నారు.. కోలీవుడ్ రీమేక్ లో నటించే యాక్టర్స్ కు టాలీవుడ్ రీమేక్ లో ప్లేస్ దక్కుతుందా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మిగతావారి సంగతి ఎలా ఉన్నా.. బెంగళూరు డేస్ తెలుగు రీమేక్ లోనూ బెర్త్ దొరికితే.. రాయ్ లక్ష్మీకి లక్ కలిసొచ్చినట్టే అని చెప్పకతప్పదు. చూద్దాం.. ఈ హాట్ లేడీ అదృష్టం ఎలా ఉందో.