Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 22 2015 @ 03:34AM

మాల్‌ప్రాక్టీస్‌ కేసులో 900 మంది అరెస్టు

పాట్నా, మార్చి 21: దేశవ్యాప్తంగా ఆసక్తిరేకెత్తించిన బీహార్‌ పదో తరగతి ఎన్నికల చీటింగ్‌ వ్యవహారంలో ఆలస్యంగా స్పందించిన నితీష్‌ కుమార్‌ సర్కార్‌ కఠిన చర్యలకు ఆదేశాలు జారీచేసింది. మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తూ దొరికిపోయిన విద్యార్థులు, వారికి సహకరిస్తున్న బంధువులు, తల్లితండ్రులతో కలిపి మొత్తం 900 పైగా మందిని అరెస్ట్‌ చేసింది. అంతే కాదు.. శనివారం పరీక్ష రాస్తూ చీటింగ్‌కు పాల్పడ్డ 551 మంది విద్యార్థులను డిబార్‌ చేసింది. విద్యార్థులనుంచి శనివారం ఒక్కరోజే రూ. 13 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేశారు. వివాదానికి కేంద్రమైన వైశాలి జిల్లాలోనూ విద్యార్థులతో పాటు పరీక్షాకేంద్రం నిరీక్షకులను సస్పెండ్‌ చేశారు.