Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 22 2015 @ 01:12AM

ప్రారంభమైన భద్రాద్రి బ్రహ్మోత్సవాలు

భద్రాచలం, మార్చి 21: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం శ్రీ స్వామివారి వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మన్మథ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని మొదట మూలవరులకు పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. అలాగే వేప పూత ప్రసాద వినియోగం చేశారు. రాత్రి శ్రీ సీతారామచంద్రస్వామిని నిత్యకల్యాణ మండపవేదిక వద్దకు తీసుకువచ్చి సంప్రదాయబద్ధంగా పూజా కార్య క్రమాలు నిర్వహించారు. ఈ సమయంలో విశ్వక్సేన పూజ,పుణ్యహవచనం నిర్వహించి పంచాంగాలను స్వామి వారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఆస్థాన పురోహితులు చెన్నావజ్జుల వెంకటేశ్వర అవధాని పంచాంగ శ్రవణం చేశారు. 2016 ఫిబ్రవరి 8న మహోదయం ఉందని కోటి చంద్ర గ్రహణాలకు ఎంత విలువ ఉందో దీనికి అంత విలువ ఉందని తెలిపారు.