Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 20 2015 @ 14:55PM

విజయవాడ: ఏసియాకప్‌ ఆర్చరీ విభాగంలో గోల్డ్‌మెడల్‌ సాధించిన తెలుగుమ్మాయి

బ్యాంకాక్‌, (మార్చి20): బ్యాంకాక్‌లో జరుగుతున్న ఏసియాకప్‌ ఆర్చరీ పోటీల్లో తెలుగమ్మాయి బంగారు పతకం సాధించి సంచలనం సృష్టించింది. విజయవాడకు చెందిన జ్యోతిసురేఖ ఏసియా కప్‌ ఆర్చరీ వ్యక్తిగత విభాగం పోటీలో విజయం సాధించి బంగారు పతకం గెలిచింది. జ్యోతిసురేఖ సాధించిన విజయం విజయవాడకే కాకుండా తెలుగురాష్ర్టానికి గర్వకారణమని నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.