Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 20 2015 @ 10:39AM

కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌‌పైనా దృష్టి పెట్టిన కాజల్‌

టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు లేని కాజల్ పనైపోయిందని కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ కాకపోతే.. తనకోసం కోలీవుడ్‌ వెయిట్‌ చేస్తోందని ఈ అమ్మడు ప్రూవ్‌ చేసింది. తెలుగులో అవకాశాలు లేకపోయినా.. కోలీవుడ్‌‌‌లో మూడు సినిమాలకు కమిటై.. చెన్నైలో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ అందాల తార. ధనుష్‌, విక్రమ్‌, విశాల్‌ సరసన నటించే అవకాశాలు దక్కించుకుని.. తమిళ తంబీలను ఫుల్లుగా ఎంటర్‌టైన్‌ చేయడానికి రెడీ అయిపోయిందితమిళంలో బిజీగా మారుతున్న ఈ అందాల భామకు.. బాలీవుడ్‌లోనూ ఆఫర్లు పెరుగుతున్నాయట. బీ టౌన్‌లోని ఓ బడా ప్రొడక్షన్‌ హౌజ్‌.. రీసెంట్‌గా కాజల్‌‌తో మూడు సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేసిందట. దీనికి సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ త్వరలోనే రావొచ్చని.. కాజల్‌కు క్లోజ్‌గా ఉండే కొందరు చర్చించుకుంటున్నారుమరోవైపు బాలీవుడ్‌లో బడా హీరోయిన్‌గా మారాలని భావిస్తున్న కాజల్‌ ఆశలు.. త్వరలోనే నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయని కొందరు అంటున్నారు. తెలుగు సినిమాల్లో నటిస్తున్న సమయంలో బాలీవుడ్‌‌పై పెద్దగా దృష్టి పెట్టని కాజల్.. ఇప్పటివరకు బీ టౌన్‌లో రెండు సినిమాల్లో మాత్రమే యాక్ట్ చేసింది. ఇప్పుడు తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో.. తన ఫోకస్‌‌ను కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌పైనా షిఫ్ట్ చేసిందట ఈ ముద్దుగుమ్మ. కోలీవుడ్‌లో ఎలాగూ తనకు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి.. బీ టౌన్‌లో ఆఫర్ల కోసం కాజల్‌ ప్రత్యేకంగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారం. ఏదేమైనా.. దీపిక, కత్రినా వంటి హాట్ భామలతో పోటీపడే రేంజ్‌‌కు కాజల్‌ ఎదగడం కష్టమే అని చెప్పాలి