Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 19 2015 @ 15:26PM

రామ్ చరణ్, శ్రీనువైట్ల సినిమాలో భారీ మార్పు

శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం మార్చి 16న సెట్స్ పైకి వెళ్లింది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ఓ భారీ మార్పు చోటుచేసుకుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా (కొలవెరి డీ ఫేం) అనిరుధ్ ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ స్థానంలో తెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌ను రీప్లేస్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ రెండు మూడు రోజుల్లో ముగియనుంది. ఏప్రిల్ రెండో తేదీ నుంచి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని విజయ దశమి కానుకగా మెగా అభిమానుల ముందుకు తీసుకురావలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.