desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 19 2015 @ 02:39AM

సింగరేణి వివిధీకరణ

కొత్త వ్యాపారాల్లో అడుగుపెడుతున్న కోల్‌ కంపెనీ
సింగరేణి (ఆంధ్రజ్యోతి): సింగరేణి బొగ్గు మాత్రమేకాకుండా ఇతర వ్యాపారాల్లోకి కూడా ప్రవేశించబోతోంది. దీనికి సంబంధించి కంపెనీ వివిధీకరణ ప్రణాళికలను సిద్ధం చేసింది. అనుకున్నట్టుగా జరిగితే మరో మూడునాలుగేళ్లలోనే సంస్థల, వేల కోట్ల రూపాయల లాభాలను సంపాదించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి పన్నులు, డివిడెండ్లు, రాయల్టీల పేరిట దాదాపు రూ.4వేల నుంచి రూ.5వేల కోట్ల వరకు అందించే అవకాశం ఉంది.
సరిహద్దులు దాటి...
సింగరేణి రానున్న రోజుల్లో ఇతర రాషా్ట్రలలో, ఇతర దేశాలలో బొగ్గుగనులను తవ్వడానికి సిద్దమవుతోంది. ఇండోనేషియా, మొజాంబిక్‌, ఆసే్ట్రలియాలలో బొగ్గు తవ్వకాలపై సర్వే జరుపుతోంది. దేశంలోని ఇతర రాషా్ట్రలలో ఆరు బ్లాక్‌లను తీసుకుని బొగ్గు తవ్వకం ద్వారా దాదాపు రూ.1000 కోట్లు లాభాలు సాధించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ మండలం పెగడపల్లి వద్ద నిర్మిస్తున్న 1800 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు వల్ల 2016-17 నుంచి రూ.800 కోట్ల నుంచి 2018-19 నాటికి దాదాపు రూ.1500 కోట్లు లాభాలు రావచ్చని సంస్థ అంచనా వేస్తోంది. రామగుండం ఎఫ్‌సిఐలో 28 శాతం లేదా అంతకన్నా తక్కువ భాగస్వామ్యం తీసుకునే ప్రయత్నాల్లో ఉంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి 200-300 కోట్ల రూపాయలు, విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుని విక్రయించడం ద్వారా మరో .200-.300ల కోట్లు లాభాలు గడించవచ్చని సంస్థ అంచనా. ఎన్‌టిపిసి తదితర సంస్థలతో జాయింట్‌ వెంచర్‌గా కొన్ని గనులను తీసుకోవడం, కన్సల్టెన్సీ సర్వీసుల ద్వారా భారీగా లాభాలు గడించే అవకాశాలున్నాయి.