Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 19 2015 @ 02:10AM

ఉగాది పురస్కార గ్రహీతలు వీరే

కమిటీ నివేదికకు సీఎం ఆమోదం
హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): న్మథనామ సంవత్సరం(2015) ఉగాది పురస్కార గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరి ఎంపికకు ప్రభుత్వ సలహాదారు రమణాచారి నేతృత్వంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణతో పాటు ఏడుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. అవార్డు గ్రహీతలను రంగాలవారీగా ఎంపికచేసిన కమిటీ.. తుది నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించింది. దీనిని సీఎం బుధవారం ఆమోదించారు. ఉగాది రోజున అవార్డు గ్రహీతలను సర్కారు సన్మానించనుంది. ఒక్కొక్కరికి రూ.10,116 నగదు బహుమతి అందజేయనుంది.
2015 ఉగాది పురస్కార గ్రహీతలు వీరే..
సాహిత్యం: ముదిగంటి సుజాతరెడ్డి, మలయశ్రీ(కరీంనగర్‌), గోరటి వెంకన్న, సంగీతం: రామలక్ష్మీరంగాచారి, రాజగోపాలాచారి, నృత్యం: సుధీర్‌రావు (వరంగల్‌), రత్నశ్రీ, నాటకం: బి. అమరేందర్‌, చిత్రకళ: సూర్యప్రకాష్‌, అంజనీరెడ్డి, శిల్పకళ: శ్రీనివాసరెడ్డి, పాండు(సిరిసిల్ల), పేరిణి నృత్యం: పేరిణి రమేష్‌, జానపద సంగీతం: వడ్డేపల్లి శ్రీనివాస్‌, జానపదకళారూప ప్రదర్శన: దర్శనం మొగులయ్య, హరికథ: పద్మాలయాచార్య (నాగర్‌కర్నూలు), బుర్రకథ: బి.సరోజిని(ఖమ్మం), ఒగ్గుకథ: ఒగ్గు ధర్మయ్య, మిమిక్రీ: ఆర్‌.సదాశివ్‌, చిందు యక్షగానం: చిందు పెదబాబయ్య(నిజామాబాద్‌), టీవీ. రంగం: నాగబాల సురేష్‌, సినిమారంగం: ఎస్‌.శంకర్‌, భూపాలరెడ్డి, జానపద చిత్రకళ: నకాష్‌ వైకుంఠం(చేర్యాల), హస్తకళ: వల్ల విజయ్‌(సిరిసిల్ల), హుజురమ్మ, కళాశ్రమం: రవీంద్రశర్మ, వేదపరిశోధన: ఎంవీ నర్సింహారెడ్డి.