Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 19 2015 @ 01:04AM

గ్రామ స్వరాజ్యం ద్వారానే అభివృద్ధి

ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి
మధిర(ఖమ్మం), మార్చి 18: గాంధీ మహాత్ముడు సూచించిన గ్రామస్వరాజ్యం ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి అన్నారు. గ్రామీణ వాతావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో గత నెల 16న చిత్తూరు జిల్లాలో ప్రారంభించిన గ్రామస్వరాజ్య యాత్ర బుధవారం తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా మధిరలో జరిగిన ‘మన కోసం-మన ఊరికి’ అనే కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. పారిశ్రామిక ప్రగతే దేశాభివృద్ధి అంటూ గ్రామాల్లో జీవనాధారమైన వ్యవసాయం, పాడి ఇతర ఆర్థిక వనరులను పాడు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వ్యవసాయంతో ఆహార ధాన్యాలు సమృద్ధితోనే గ్రామస్వరాజ్యం చేకూరి దేశాభివృద్ధి జరుగుతుందన్నారు.