Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 18 2015 @ 20:12PM

బృంగి వాహనంపై ఊరేగిన మల్లన్న

శ్రీశైలం, మార్చి 18: శ్రీశైలం మల్లికార్జునస్వామిని బృంగి వాహనంపై ఊరేగించారు. ఉగాది మహోత్సవం సందర్భంగా పురవీధుల్లో మల్లన్న ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా భ్రమరాంబదేవి మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మల్లన్న ఊరేగింపునకు భక్తలు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి, స్వామి కృపను భక్తులు పొందారు.